Actress: స్టార్ హీరోయిన్ బ‌యోపిక్‌పై చ‌ర్చ‌లు.. తీయోద్దని వేడుకుంటున్న గ్లోబ‌ల్ బ్యూటీ

Actress: ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్‌ల హంగామా న‌డుస్తుంది. ప్ర‌ముఖుల బ‌యోపిక్స్ చేస్తూ ప్రేక్ష‌కులకి మంచి వినోదాన్ని అందిస్తున్నారు. సినీ, క్రీడా రాజ‌కీయ ప్ర‌ముఖుల బ‌యోపిక్స్ రూపొందుతుండ‌గా, ప్రియాంక చోప్రా బ‌యోపిక్ కూడా చేయాల‌ని కొంద‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈ విష‌యం ప్రియాంకకి తెలియ‌డంతో వెంట‌నే స్పందించింది.

వెండితెరపై అందాల విందిస్తూ సత్తా చాటిన ప్రియాంక చోప్రా.. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేసి అతన్నే పెళ్లాడింది. పెళ్లి తర్వాత వీలు చిక్కినప్పుడుడల్లా పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తూ రచ్చ చేస్తుండటం హాబీగా పెట్టుకుంది ఈ రొమాంటిక్ పెయిర్. అయితే 15 ఏళ్ల త‌ర్వాత ఈ జంట విడిపోతుంద‌ని కేఆర్కే జోస్యం చెప్పిన విష‌యం తెలిసిందే.

ఒక‌ప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం హాలీవుడ్‌కే ప‌రిమిత‌మైంది. అక్క‌డే ఎక్కువగా సినిమాలు, సీరియ‌ల్స్,వెబ్ సిరీస్‌లు చేస్తుంది. గ్లోబ‌ల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా తమిళ చిత్రం ‘తమిజాన్‌’తో నాయికగా కెరీర్‌ మొదలుపెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ బాలీవుడ్‌లో స్టార్‌ కథానాయికగా ఎదిగింది.

పలు అంతర్జాతీయ వేదికలపై గౌరవాలు, సత్కారాలు అందుకుంటున్న ప్రియాంక చోప్రా బ‌యోపిక్‌పై అంత‌టా చ‌ర్చ న‌డుస్తుంది. ఈ క్ర‌మంలో బ‌యోపిక్ గురించి ప్రియాంక స్పందన ఏంట‌ని అడిగితే, అందుకు స్పందించిన పీసీ ..‘‘దయచేసి నా బయోపిక్‌ తీయొద్దు. ఎందుకంటే నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకా ఆ దశకు చేరుకోలేదు’’అని చెబుతోంది .‘మాట్రిక్స్‌’, ‘టెక్ట్స్‌ ఫర్‌ యు’తో పాటు పలు హాలీవుడ్‌ చిత్రాలు ఆమె చేతిలోఉన్నాయి.

రీసెంట్‌గా త‌న 39వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంది ప్రియాంక‌. ఈ సంద‌ర్భంగా ఆమెకు బంధువులు,అభిమానులు, స‌న్నిహితులు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. భ‌ర్త నిక్ జోనాస్ కాస్త స్పెష‌ల్ విషెస్ అందించాడు. షూటింగ్ నిమిత్తం ప్రియాంక లండ‌న్‌లో ఉండ‌డం వ‌ల‌న అమెరికాలో ఉన్న నిక్ త‌న భార్య‌కు ఖరీదైన వైన్‌ బాటిల్‌ను పుట్టినరోజు బహుమతిగా పంపించాడు. ఆ బాటిల్‌ ఫొటోను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది ప్రియాంక.