Actress Priyamani : ఒరేయ్.. కుక్కల్ని కూడా వదలరా.. ప్రియమణి షాకింగ్ పోస్టు..!

NQ Staff - March 21, 2023 / 10:21 AM IST

Actress Priyamani  : ఒరేయ్.. కుక్కల్ని కూడా వదలరా.. ప్రియమణి షాకింగ్ పోస్టు..!

Actress Priyamani  : ఈ నడుమ సమాజంలో జరుగుతున్న దారుణాలు ఒకింత భయానకంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల మీద జరుగుతున్న దారుణాలు అయితే అంతా ఇంతా కాదు. ఈ నడుమ అయితే మరీ దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. అర్థరాత్రి సమయాల్లోనే కాదు.. కనీసం పట్టపగలు కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది.

ఇక తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన దారుణం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. పాట్నాలో ఓ వ్యక్తి.. కుక్కను రేప్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ ఒకింత భయానికి గురి చేస్తోంది.

అసహ్యం వేస్తోంది..

ఈ క్రమంలోనే సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఈ సంఘటనపై స్పందించింది. ఒరేయ్ ఆఖరకు కుక్కల్ని కూడా వదలరారా అంటూ షాకింగ్ పోస్టు పెట్టింది. ఇలాంటి ఘటనలు చూస్తే చాలా అసహ్యం వేస్తుంది అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. దీంతో ప్రియమణి పోస్ట్ పై చాలామంది రియాక్ట్ అవుతున్నారు.

మన దేశంలో అమ్మాయిల దగ్గరనుండి వృద్ధ మహిళల వరకు రక్షణ లేదనుకుంటే.. ఇప్పుడు ఏకంగా మూగ జీవాలకు కూడా రక్షణ లేకుండా పోయిందంటూ ఎమోషనల్ కామెంట్లు పెడుతున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us