Pragathi: బాబోయ్ ఈ ఆంటీ చేస్తున్న వ‌ర్క‌వుట్స్ చూస్తే దిమ్మ తిర‌గ‌డం ఖాయం..!

Pragathi: తెలుగు సినీ ప్రేక్షకులకు అమ్మగా.. అత్తగా.. పిన్నిగా.. వదినగా… ఇలా ఎన్నో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపించి సంద‌డి చేసిన న‌టి ప్ర‌గ‌తి. ఇటీవ‌లి కాలంలో ఈవిడ సోష‌ల్ మీడియాలో దూకుడు పెంచింది. త‌న వ‌ర్క‌వుట్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు తెగ షేర్ చేస్తూ నెటిజన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది. గత కొన్ని రోజులుగా ప్రగతి జిమ్ వీడియోలు నెట్టింట్లో హల్‏చల్ చేస్తున్నాయి. అందులో చెమటలు కక్కుతూ ప్రగతి వర్కవుట్స్ చేస్తూ కనిపించింది.

Actress Pragathi Workouts Latest Video
Actress Pragathi Workouts Latest Video

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఆమె కంటూ సపరేట్ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ప్ర‌గ‌తి. కొద్ది రోజులుగా జిమ్‏లో కష్టతరమైన వర్కవుట్స్ చేస్తుంది. తాజాగా ప్ర‌గ‌తికి సంబంధించిన వీడియో ఒక‌టి విడుద‌ల కాగా, ఇందులో వెరైటీ వ‌ర్క‌వుట్స్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. ఈ వ‌య‌స్సులోను ఇంత అందంగా క‌నిపించ‌డానికి కారణం ఇంత హార్డ్ వ‌ర్కా అని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఆ మ‌ధ్య‌ తన స్నేహితురాలితో కలిసి పాపులర్‌ తమిళ సాంగ్ ‘ఫేమ‌స్‌ డ్రీమ‌మ్ వేక‌ప‌మ్’‌కు దుమ్ములేపింది. చీరకట్టులో ప్రగతి మాస్‌ స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్‌ చేసిందనే చెప్పోచ్చు. ఇక ఇది చూసిన నెటిజన్స్ ప్రగతి మీరు సూపర్ డాన్సర్ అంటు మెచ్చుకున్నారు. ఈ ఏజ్‌లో కూడా ఫిట్‌గా ఉంటూ ఎంతో ఎనర్జీగా డ్యాన్స్‌ చేశారంటూ పలువురు ప్ర‌శంస‌లు కురిపించారు.