Actress Pragathi : రెండవ పెళ్లి విషయంలో నటి ప్రగతి భలే కామెంట్స్..!
NQ Staff - January 3, 2023 / 09:59 PM IST

Actress Pragathi : తెలుగు ప్రేక్షకులను అమ్మగా.. అక్కగా.. అత్తగా.. వదినగా అలరిస్తున్న సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి. ఈమె ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తన అందంతో కూడా మెప్పిస్తున్న విషయం తెలిసిందే.
స్టార్ హీరోలకు అందమైన అమ్మగా ఎన్నో సినిమాల్లో నటించిన ప్రగతి ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో తన వీడియోలు మరియు కామెంట్స్ తో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎర్లీ మ్యారేజ్ తన జీవితంలో అతిపెద్ద తప్పు అంటూ వ్యాఖ్యలు చేసింది.
తాను ఆ సమయంలో పెళ్లి నిర్ణయం తీసుకోకుండా ఉంటే హీరోయిన్ గా కచ్చితంగా మంచి స్థాయిలో ఉండేదాన్ని.. హీరోయిన్ గా మరిన్ని సినిమాలు చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను నటన పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టలేదని కూడా పేర్కొంది.
ఇక రెండవ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా, ఎప్పుడైనా ఆ ఆలోచన చేశారా అంటూ ప్రశ్నించగా.. పెళ్లి అనే పదం కన్నా కంప్యానియన్ అంటే బాగుంటుంది. చాలా సార్లు నాకు ఒక మంచి కంప్యానియన్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
కానీ నా మెచ్యూరిటీ కి తగ్గట్లుగా నా యొక్క అభిరుచికి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యే వాళ్ళు దొరికితే బాగుంటుంది. కానీ అలా మ్యాచ్ అయ్యే వాళ్ళు దొరుకుతారని నేను భావించడం లేదు. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని ప్రగతి పేర్కొంది.