Actress Poorna : నిండు గర్భంతో చేయకూడని పని చేసిన పూర్ణ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..!
NQ Staff - April 1, 2023 / 10:20 AM IST

Actress Poorna : సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే విమర్వల పాలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. లేకపోతే వారు ఎక్కడ ఏం చేసినా సరే క్షణాల్లోనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు పూర్ణ చేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆమె మలయాళం నుంచి వచ్చినా కూడా తెలుగు అమ్మాయిగా అనిపిస్తుంది. తెలుగులో ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. తాజాగా నాని హీరోగా వచ్చిన దసరా మూవీలో కూడా కీలక పాత్రలో నటించింది. ఇందులో ఆమె వదినమ్మ పాత్రలో నటించింది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పూర్ణ నిండు గర్భిణిగా ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఆమె డెలివరీ కాబోతోంది. ఇలాంటి సమయంలో ఆమె డ్యాన్స్ చేసింది. అది కూడా దసరా మూవీలోని చమ్కీల అంగీలేసి సినిమాలోని పాటకు స్టెప్పులేసింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.
నిండు గర్భిణితో ఉండి ఇలాంటి చెత్త పనులు అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొద్ది రోజుల్లో డెలివరీ పెట్టుకుని ఇలా డ్యాన్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఆ వీడియోపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.