Actress: పవన్ హీరోయిన్ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లేనా..?

Actress: పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమాలో కూడా నటించకుండానే పవన్ హీరోయిన్ అయిపోయింది పూనమ్ కౌర్. సినిమాల కంటే కూడా ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయింది. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ పై విమర్శలు చేస్తూ ఎక్కువగా గుర్తింపు సంపాదించుకుంది పూనమ్ కౌర్. పవన్ కళ్యాణ్ పక్కనే ఉండి నాశనం చేస్తున్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత కొన్నాళ్ళు కత్తి మహేష్ ను కూడా బాగానే టార్గెట్ చేసింది ఈమె.

ఇవన్నీ చేయకుంటే ముందే తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. ఎస్.వి.కృష్ణారెడ్డి తెరకెక్కించిన మాయాజాలం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత తేజ ఒక విచిత్రం, వినాయకుడు, గోపీచంద్ శౌర్యం, వెంకటేష్ నాగవల్లి, నాగార్జున గగనం, రామ్ గోపాల్ వర్మ ఎటాక్, త్రిష నాయకి లాంటి సినిమాల్లో నటించింది. వీటితో ఈమెకు పెద్దగా పాపులారిటీ వచ్చింది ఏమీ లేదు.. కానీ పవన్ కళ్యాణ్ పేరు వాడినప్పుడే ఎక్కువగా గుర్తింపు సంపాదించుకుంది.

ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంది. కొన్నేళ్లుగా తెలుగు తెరపై పూనమ్ అస్సలు కనిపించడం లేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అప్పుడప్పుడు పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. దానికి తోడు ఆధ్యాత్మిక చింతన ఈమెకు ఎక్కువే. ఒక వైపు భక్తి మార్గం.. మరోవైపు గ్లామర్ రెండూ కలగలిపి అభిమానులకు చేరువయ్యేలా ప్లాన్స్ వేస్తోంది పూనమ్ కౌర్. ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై నటనకు పూర్తిగా దూరంగా ఉండాలని సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

రీసెంట్‌గా పూన‌మ్ క‌త్తి మ‌హేష్ ప్ర‌మాదంపై ఇన్‌డైరెక్ట్ ట్వీట్ చేసి వార్త‌ల‌లోకి ఎక్కింది. రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్, వదిలేశావ్ ఏళ్ల నుంచి పద్దతిగా తన పని తాను చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని.. నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను.. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావ్ అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్ అని పూనమ్ కౌర్ ట్వీట్ వేశారు.