Actress Neena Gupta Made Interesting Comments : ఫస్ట్ టైమ్ కిస్ చేసినప్పుడు నోటిని డెటాల్ తో కడిగా.. ప్రముఖ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్లు..!
NQ Staff - June 29, 2023 / 02:12 PM IST

Actress Neena Gupta Made Interesting Comments :
సినిమా రంగం అన్న తర్వాత రొమాంటిక్ సీన్లు, కిస్ సీన్లు అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి. అయితే కొందరు హీరోయిన్లు కిస్ సీన్లను ఎంకరేజ్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఒప్పుకోవట్లేదు. తాజాగా మరో సీనియర్ నటి చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో కాదు లస్ట్ స్టోరీస్-2 నటి నీనా గుప్తా.
ప్రస్తుతం లస్ట్ స్టోరీస్-2 లో ఆమె నటిస్తోంది. ఇందులో విజయ్ వర్మ, తమన్నా, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా లాంటి వారు నటిస్తున్నారు. ఇక ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా నీనాగుప్తా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను గతంలో ఫస్ట్ టైమ్ కిస్ సీన్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను.
అప్పట్లో నటుడు దిలీప్ ధావన్ తో ఓ టీవీ సీరియల్ లో నటించాను. ఓ సారి మా ఇద్దరి మధ్య కిస్ సీన్ పెట్టారు. బహుషా టెలివిజన్ చరిత్రలో అదే మొదటిది కావచ్చు. కానీ ఎందుకో నాకు పెద్దగా ఆసక్తిగా లేదు. అయినా సరే అయిష్టంగానే ఆ కిస్ సీన్ చేశాను. అతను చాలా అందంగా ఉంటాడు.
కానీ నీకు ఆ కిస్ సీన్ లైఫ్ లో మొదటిది. ఇష్టం లేకుండా చేయడంతో నా నోటిని డెటాల్ తో కడుక్కున్నాను. ఆ రోజు రాత్రంతా నిద్రకూడా పోలేదు. ఆ తర్వాత నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. నటిగా నిరూపించుకోవాలంటే ఇలాంటివన్నీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ తెలిపింది నీనాగుప్తా.