Nandini Rai: పోసాని శవం ప‌క్క‌న సంతోషంతో డ్యాన్స్ చేసిన హీరోయిన్.. వీడియో హ‌ల్‌చ‌ల్‌

Nandini Rai: పోసాని కృష్ణ ముర‌ళి ప్ర‌స్తుతం.. ప‌వ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ ట్రెండింగ్‌లో నిలిచాడు.ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న కుటుంబాన్ని కూడా వివాదంలోకి లాగి ర‌చ్చ చేశాడు. ఈ క్ర‌మంలో రచయిత పోసాని కృష్ణ మురళి ఇంటిపై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. పోసానితోపాటు కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారు.

Actress Nandini Rai Dances At Posani Krishna Murali Dead Body
Actress Nandini Rai Dances At Posani Krishna Murali Dead Body

మూడు రోజుల క్రితం పోసానిపై దాడికి యత్నించడం, ఇంటి వద్ద రాళ్లదాడి చేయ డాన్ని బట్టి చూస్తే ఇది పవన్‌ కల్యాణ్‌ అభిమానుల పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోసాని నివాసంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అమీర్‌పేట మెట్రో స్టేషన్, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంతోపాటు ప్రైవేటు హాస్టల్‌ సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

అయితే ప్ర‌స్తుతం పోసాని వివాదంతో ట్రెండింగ్‌లో నిల‌వ‌గా, ఆయ‌న వీడియో ఒకటి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. తెలుగు సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న పేరే. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా నటించింది. వరుసగా ఆఫర్లు కూడా అందుకుంది. ఈ బ్యూటీ ఆ మ‌ధ్య‌ పోసాని శవం పక్కన డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా లో షేర్ చేసింది.

నందిని రాయ్.. పోసాని నటిస్తున్న ‘ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఈ సిరీస్ లో పోసాని మరణించే సీన్ ఉందట.. అందులో భాగంగా సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఇలా డ్యాన్స్ చేసింది. ఇప్పుడుఈ వీడియోని తెగ వైర‌ల్ చేస్తున్నారు.