త‌న‌కు చేత‌బ‌డి చేశార‌ని చెప్పిన ఆదిత్య 369 హీరోయిన్.. ఏసు ప్ర‌భువే కాపాడాడని కామెంట్

ఆదిత్య 369’, ‘డిటెక్టివ్‌ నారద’ వంటి దాదాపు 100పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి మోహిని ముద్దుపేరు తంజావూరు మ‌హాల‌క్ష్మీ. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక మోహినిగా, ప్ర‌స్తుతం క్రిస్టియానాగా పిల‌వ‌బ‌డుతుంది. మోహన్ బాబు హీరోగా వచ్చిన ‘డిటెక్టివ్‌ నారద’లో నటించి ఫేమ్ అయిన ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించారు.

Actress Mohin Shares Her Tough Time in Her Life
Actress Mohin Shares Her Tough Time in Her Life

కోట్ల మంది హిందువులకు గురువైన రమణ మహర్షికి వరసకు మనమరాలైన ఈ మోహిని త‌న జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌నల‌కు సంబంధించిన విష‌యాలను షేర్ చేసింది. శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తాను 13 ఏళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసినట్లుగా చెప్పిన మోహిని.. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సినిమాల్లోకి వెళ్ల‌డం వ‌ల‌న కుటుంబం నుండి వ్య‌తిరేఖ‌త సంపాదించింది.

చిరంజీవితో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారింద‌ని చెప్పిన మోహిని హిట్ల‌ర్ చిత్రంలో హీరోయిన్ పాత్ర మిస్ అయి చెల్లెలి పాత్ర ద‌క్కింది. ఆ తర్వాత చిరుతో హీరోయిన్‌గా చేసే అవకాశం లభించలేదు” అని మోహిని అన్నారు. ఇకపోతే పెళ్లి తర్వాత తన మానసిక స్థితి గురించి ఓపెన్ అయిన మోహిని.. పెళ్ళైన ఐదేళ్లకు అనేక మానసిక సమస్యలు ఎదురయ్యాయని, రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశానని తెలిపారు.

కొన్ని సంద‌ర్భాల్లో చాలా ఇబ్బందుల‌కి గుర‌య్యాను. ఓ జ్యోతిష్కుడికి చూపించ‌గా చేత‌బ‌డి చేశార‌ని చెప్పారు. అనేక పూజలు, ప్రార్థనలు చేసి యేసు ప్రభును నమ్ముకున్నానని, అప్పటినుంచి మానసిక సమస్యలు దూరమయ్యాయని ఆమె తెలిపారు. సమస్య రాకముందు ప్రతి రోజు అమ్మవారి పూజలు చేసేదాన్ని. వచ్చిన తర్వాత పూజలు మానేశాను. ఆలయానికి వెళ్లటం కూడా మానేశాను. దైవాన్వేషణలో తీవ్రంగా ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ‘‘దేవుడంటే ఎవరు? ఆడా.. మగా? నేను దేవుడు సృష్టించిన బిడ్డను.. అలాంటి నాకు దేవుడు ఎందుకు కనబడటం లేదు?’’ లాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం ధ్యానం చేసేదాన్ని. ఆ సమయంలో ఒక రోజు ధ్యానంలో క్రీస్తు కనిపించారు.

ఆయ‌న న‌న్ను చిరున‌వ్వుతో చూస్తుండ‌గా, ‘నన్ను కాపాడతాడా? లేదా?’ అని ఆలోచిస్తుంటే- ఆయన ‘నిన్ను కాపాడతాను’ అన్నట్లు నవ్వారు. ఆ తర్వాత నేను నా సమస్యల నుంచి బయటపడ్డాను. ఏసుస్వామే నా దేవుడని అప్పుడే తెలిసింది. ఆ తర్వాత ఒక పాస్టర్‌ ఇంటికి వచ్చి ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో నేను 13 యాసలతో మాట్లాడాను. చిత్రమేమంటే నేను మాట్లాడిన మాటలు నాకు కూడా వినిపిస్తున్నాయి.. అయినా నేను వాటిని ఆపలేకపోయాను. ఆ తర్వాత- ‘ఈ అమ్మాయి అటువైపు వెళ్లిపోయింది. ఇక ఈ అమ్మాయిని ఏమీ చేయలేము. మాకు నిప్పులపై ఉన్నట్లుంది. ఆయన పేరు చెప్పి మమ్మల్ని పంపించేయండి’ అనే మాటలు వినిపించాయి.

నాకు దేవుడు అంటే ఏసునే. మైకు ప‌ట్టుకొని ప్రచారం చేయ‌ను. నా శ్రేయోభిలాషుల‌కు జీవిత స‌త్యాలు చెబుతాను అని పేర్కొంది మోహిని. మంచి అవకాశం లభిస్తే సినిమాల్లో నటించేందుకు రెడీ అని ఆమె అన్నారు.