పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన హీరోయిన్.. ఆ విష‌యం దాయ‌డంతో అందరిలో ఆశ్చ‌ర్యం

మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ఆకట్టుకొంటున్న న‌టి మియా జార్జ్ . అందం, అభినయం కలబోసి ఉన్న ఈ నటి తొలుత టెలివిజన్ రంగంలో కెరీర్ ఆరంభించారు. ఆమె హోస్టుగా కొనసాగుతుండగానే వచ్చిన రెడ్ వైన్, మెమొరీస్ లాంటి అవకాశాలను అందిపుచ్చుకొన్నారు. ఆ చిత్రాల్లో ఆమె ఫెర్ఫార్మెన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో నటిగా కొనసాగారు.

Actress Mia George Delivers Baby Boy
Actress Mia George Delivers Baby Boy

మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న మియా జార్జ్ ప్రస్తుతం విక్రమ్‌తో కలిసి కోబ్రా అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ అమ్మ‌డు లాక్‌డౌన్ స‌మ‌యంలో సెప్టెంబ‌ర్ 12న కేరళలో వ్యాపారవేత్త అయిన అశ్విన్ ఫిలిప్స్‌ని సీక్రెట్‌గావివాహం చేసుకుంది. క‌రోనా వ‌ల‌న వీరి వివాహానికి కొద్ది మంది స్నేహితులు, కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు.

అయితే మియా జార్జ్ త‌ను గ‌ర్భ‌వ‌తి అనే విష‌యం చెప్ప‌కుండానే డైరెక్ట్‌గా త‌న‌కు పండంటి మ‌గ బిడ్డ జ‌న్మించాడ‌ని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. జూలై 7వ తేదీన ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వ‌గా, ఈ శుభవార్తను మియా జార్జ్, ఆమె భర్త అశ్విన్ ఫిలిప్స్ తమ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇన్స్‌టాగ్రామ్‌లో మగపిల్లాడికి జన్మనిచ్చానని చెబుతూ చిన్నారితోపాటు తమ కుటుంబ ఫోటోను షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకొన్నారు.

మాకు మ‌గ‌బిడ్డ జ‌న్మించారు. ల‌వ్లీ బుడ‌త పేరు లుకా జోసెఫ్ ఫిలిప్ అని పేర్కొన‌గా, మియా జార్జ్ ఆమె భ‌ర్త అశ్విన్ ఫిలిప్స్‌కు కుటుంబ స‌భ్యులు, అభిమానులు, నెటిజ‌న్స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. బిడ్డ పుట్టాక ఈ అమ్మ‌డు సినిమాల‌కు దూరంగా ఉంటుందా లేక కొన‌సాగిస్తుందా అనేది చూడాలి.