Meena: మీనా బర్త్ డే లో మళ్లీ వాళ్లంతా కలిశారు.. చూడండి
NQ Staff - September 18, 2022 / 10:22 AM IST

Meena : సీనియర్ హీరోయిన్ మీనా మరోసారి వార్తల్లో నిలిచారు.. సెప్టెంబర్ 16వ తారీఖున మీనా పుట్టిన రోజు ఆ సందర్భంగా పలువురు స్నేహితుల మధ్య ఆమె తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఇటీవల ఆమె భర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ బాధ నుండి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న మీనా పుట్టిన రోజు జరిపేందుకు ఆమె స్నేహితులు పెద్ద పార్టీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.

Actress Meeting Meena house on her Birthday
మీనా పుట్టిన రోజు పార్టీలో సీనియర్ హీరోయిన్లు సంగీత, రంభ, సంఘవి ఇంకా తదితరులు పాల్గొన్నారు. సీనియర్ హీరోయిన్ మీనా తన 46వ పుట్టిన రోజును స్నేహితులతో జరుపుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి కలయిక ఫోటోలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఒకే ఫ్రేమ్ లో ఇంత మంది సీనియర్ హీరోయిన్స్ ని చూడటం ఆనందంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో మీనా తెలుగు మరియు తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఆమెకు ఇప్పటికీ కూడా తెలుగు మరి తమిళంలో వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆఫర్లు వస్తాయి అనడంలో సందేహం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె ఓకే చెప్పాలి కానీ ఆమె తలుపు తట్టేందుకు ఎప్పుడు దర్శకులు సిద్ధంగానే ఉంటారు. దృశ్యం 3 సినిమాలో ప్రస్తుతం ఈమె నటిస్తోంది. అక్కడ సినిమా సక్సెస్ అయితే వెంటనే తెలుగులో అదే సినిమా ను రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే.
ఆ రీమేక్ లో కూడా మీనా నటించబోతుంది. మొత్తానికి వరుసగా సినిమాల్లో నటిస్తున్న మీనా ఇలా స్నేహితురాలతో బర్త్డే పార్టీ చేసుకుంటూ వార్తలు నిలవడంతో నిలవడం జరిగింది. ఈ సందర్భంగా మా తరఫున కూడా మీనా గారికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.