Actress Madhavi Latha : నాకు అంత కామం లేదు.. పెండ్లిపై బోల్డ్ కామెంట్లు చేసిన మాధవీ లత..!
NQ Staff - June 2, 2023 / 11:15 AM IST

Actress Madhavi Latha : ఈ నడుమ కొందరు సెలబ్రిటీలు నోటి దురుసును ప్రవర్తిస్తున్నారు. అది వారిని విమర్శల పాలు చేస్తోంది. ఎంతైనా సెలబ్రిటీలు అన్న తర్వాత కాస్త ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అంతే గానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ సోషల్ మీడియా యుగంలో వారు అబాసు పాలు కావాల్సి వస్తుంది.
తాజాగా మాధవీ లత కూడా ఇలాంటి పని చేసి వార్తల్లో నిలిచింది. ఆమె గతంలో నచ్చావులే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆమెకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ పెద్దగా హిట్లు రాలేదు. దాంతో ఆమె త్వరగానే ఇండస్ట్రీలో కనుమరుగై పోయింది. అప్పటినుంచి ఆమె బయటనే ఉంటుంది.
ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో ఆమెను పెండ్లి గురించి కొందరు ప్రశ్నలు అడిగారు. మీరెప్పుడు పెండ్లి చేసుకుంటారు అంటూ కొందరు ఆకతాయిలు ఆమెను ప్రశ్నించారు. దాంతో ఆమె సీరియస్ కామెంట్లు చేసింది. నాకు పెండ్లి చేసుకునేంత కామం లేదు అంటూ వ్యాఖ్యలు చేసింది.
దాంతో ఈ కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అంటే పెండ్లి చేసుకునేవారందరికీ కామం ఉండే చేసుకుంటున్నారా అంటూ కొందరు అడుగుతున్నారు. ప్రస్తుతం ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె ఇంటి వద్దనే ఖాళీగా ఉంటుంది.