Actress Laya :  ఆ విషయంలో నన్ను చాలా మంది మోసం చేశారు : లయ

NQ Staff - March 6, 2023 / 09:23 PM IST

Actress Laya :  ఆ విషయంలో నన్ను చాలా మంది మోసం చేశారు : లయ

Actress Laya  : తెలుగు అమ్మాయి లయ ఎన్నో సినిమాలు నటించి ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. టాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్ హీరోలకు జోడిగా నటించిన లయ పెళ్లి తర్వాత సినిమాలను పూర్తిగా వదిలేసింది. భర్త, పిల్లలతో ప్రస్తుతం అమెరికాలో వైవాహిక జీవితాన్ని గడుపుతుంది.

ఈ మధ్య కాలంలో లయ పదే పదే వార్తల్లో నిలుస్తోంది. టాలీవుడ్ లో మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు లయ ప్రయత్నాలు చేస్తోంది అనే ప్రచారం జరుగుతుంది. ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదటి నుండి కూడా నేను చాలా సాఫ్ట్. ప్రతి విషయంలో కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించే దాన్ని, అందువల్ల చాలా మంది నిర్మాతలు నాకు డబ్బులు ఎగ్గొట్టారు.

ఒక సినిమాలో నటించిన నటీనటులందరికీ డబ్బులు ఇచ్చి నాకు మాత్రం ఇవ్వలేదు. అలా చాలా సార్లు జరిగింది. మీరు గట్టిగా డబ్బులు అడిగితే ఇస్తారని నాతో ఇతర నటీనటులు అనేవారు. కానీ నేను మాత్రం గట్టిగా అడగలేక పోయేదాన్ని. కొందరు డబ్బులు ఇస్తేనే షూటింగ్ కి వస్తామని చెప్పేవారట, కానీ నేను మాత్రం ఎప్పుడూ కూడా అలా చెప్పలేదు.

కొన్నిసార్లు తర్వాత ప్రాజెక్టు చేసేటప్పుడు డబ్బులు ఇస్తామని ముందు ప్రాజెక్టు చేయించుకునే వాళ్ళు. ఆ తర్వాత కనిపించే వాళ్ళు కాదు. అలా ఎంతో మంది నాకు డబ్బులు ఎగ్గొట్టారు అంటూ సీనియర్‌ హీరోయిన్ లయ చెప్పుకొచ్చింది. ఇక యూట్యూబ్ లో తన గురించి వస్తున్న పుకార్లన్నింటినీ కూడా ఆమె కొట్టిపారేసింది. ప్రస్తుతం తాను వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నట్లుగా పేర్కొంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us