Laya : సీనియర్ హీరోయిన్ లయ గారాల పట్టి ఫోటోలు వైరల్.! ఎందుకో తెలుసా.?
NQ Staff - September 26, 2022 / 08:17 AM IST

Laya : తెలుగమ్మాయ్ లయకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లయ ఆ తర్వాత ‘హనుమాన్ జంక్షన్’, ‘కోదండరాముడు’, ‘ప్రేమించు’, ‘శివరామరాజు’, తదితర సినిమాలతో మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో వున్న టైమ్‌లోనే లయ, ఎన్నారై వ్యక్తిని పెళ్లి చేసుకుని, అమెరికాలో సెటిలైపోయింది.

Actress Laya Daughter Shloka Photos Viral on Social Media
అతిగా గ్లామర్ పాత్రలు కాకుండా, ఫ్యామిలీ తరహాలో నటించిన లయ, తెలుగమ్మాయిల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన సక్సెస్‌ని అందుకుంది టాలీవుడ్‌లో.అయితే, పెళ్లి తర్వాత లయ సినిమాల్లో నటించింది లేదు. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ అమెరికాలోనే వుండిపోయింది. లయకు ఓ అమ్మాయి, అబ్బాయి. ఈ మధ్యనే లయ సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా కనిపిస్తోంది.
అందుకు కారణం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ట్రై చేస్తోందనే సమాచారం వుంది. ఆల్రెడీ సెకండ్ ఇన్నింగ్స్‌లో లయ, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటించింది. అయితే, పెద్దగా గుర్తింపు రాలేదు ఆ సినిమాతో లయకు. కానీ, తన డాన్సింగ్ వీడియోలతో ఈ మధ్య సోసల్ మీడియాలో బాగా గుర్తింపు దక్కించుకుంది లయ.
ఇంతకీ అసలు వీషయమేంటంటే, లయ ముద్దుల తనయ శ్లోక ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
అందుకు కారణం ముద్దుగా బొద్దుగా వున్న శ్లోకను అచ్చం తెలుగమ్మాయ్‌లా ముస్తాబు చేసి, ఆ ఫోటోల్ని నెట్టింట్లో పోస్ట్ చేసింది లయ. అచ్చు అమ్మలాగే, అందంగా, ముద్దుగా వుందంటూ ఈ ఫోటోలను షేర్లతో, లైక్‌లతో నెట్టింట్లో ట్రెండింగ్ చేస్తున్నారు.