Actress Laila : ఒకప్పటి అందాల తార లైలా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

NQ Staff - March 3, 2023 / 10:25 AM IST

Actress Laila : ఒకప్పటి అందాల తార లైలా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Actress Laila : ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలా గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె అందాలకు అప్పట్లో చాలామంది ఫ్యాన్స్‌ ఉండేవారు. తన అందమైన చిరునవ్వుతోనే కోట్లాది మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. కాగా కెరీర్‌ పీక్స్‌ లో ఉండగానే ఆమె తన ప్రియుడిని పెండ్లి చేసుకుని సెటల్ అయిపోయింది. ఆమె అంటే ఇప్పటికీ అందరికీ గుర్తుకు వచ్చే మూవీ ఎగిరే పావురం.

తెలుగులో లైలా ఈ సినిమాతోనే పరిచయం అయిపోయింది. ఇందులో ఆమె అల్లరికి అంతా ఫిదా అయిపోయారు. అంతకు ముందే ఆమె హిందీలో రెండు, మూడు సినిమాల్లో నటించింది. ఇలా తెలుగు తెరపైకి అడుగు పెట్టిన తర్వాత ఆమె చాలా సినిమాల్లోనే నటించింది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది.

టీవీ షోలలో సందడి..

తన ప్రియుడు మెహ్దీతో ఎనిమిదేండ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత పెండ్లి చేసుకుని సెటిల్‌ అయిపోయింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చాలా కాలం తర్వాత ఆమె ఇప్పుడిప్పుడే పలు టీవీ షోలతో వెలుగులోకి వస్తోంది. రీసెంట్ గానే కార్తి హీరోగా వచ్చిన సర్దార్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

మంచి కథ వస్తే తెలుగులోకి కూడా రావాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఆమె ఇలా మారి పోయిందేంటా అని అంతా కామెంట్లు పెడుతున్నారు. ఆమె అందం ఇప్పటికీ తగ్గకపోయినా.. కాస్త లావుగా మారినట్టు కనిపిస్తోంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us