Actress: లోప‌ల ఏం వేసుకోలేదా అంటూ న‌టిపై నీచ‌మైన ట్రోలింగ్

Actress: సోష‌ల్ మీడియా వ‌ల‌న సెల‌బ్రిటీల‌కు మంచేమో గాని మ‌న‌శ్శాంతి లేకుండా పోతుంది. వీలున్న‌ప్పుడ‌ల్లా అభిమానుల‌తో స‌ర‌దాగా మాట్లాడాల‌ని, వారికి ఎంట‌ర్‌టైన్‌మైంట్ అందించాల‌నే ఉద్దేశంతో సెల‌బ్స్ త‌మ‌కు సంబంధించిన ప‌ర్స‌న‌ల్,ప్రొఫెష‌న‌ల్ విషయాల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే కొంద‌రు ఆ పోస్ట్‌ల‌లో త‌ప్పులు ఎత్తి చూపిస్తూ ట్రోలింగ్ చేస్తుంటారు.

ట్రోలింగ్ లిమిట్స్‌లో ఉంటే ఫర్వాలేదు.. కానీ, వాళ్ల శరీర భాగాలను ఉద్దేశించి ఘోరమైన కామెంట్స్ చేస్తే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. తాజాగా మరాఠి నటి హేమాంగి కవిని ఇలానే కామెంట్ చేశారు. మ‌రాఠీ హిందీ సినిమాల‌తో పాటు సీరియ‌ల్స్‌లోను న‌టించే హేమాంగి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌ర‌చు త‌న‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ని నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఈ క్ర‌మంలో నెటిజన్ల నుంచి హేమాంగి చాలా సందర్భాల్లో ట్రోలింగ్ ఎదురుకుంది. కానీ, ఈసారి మాత్రం నెటిజన్ల నుంచి ట్రోలింగ్ పరిమితులు ఎంతో దిగజారి నీచంగా మారింది. టైట్ టీ ష‌ర్ట్ ధ‌రించి చ‌పాతీలు చేసిన వీడియోని పోస్ట్ చేయ‌గా, దీనికి ఓ నెటిజ‌న్ .. ‘లోదుస్తులు ధరించలేదా..? నీ వక్షో*లు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ’ దారుణంగా ట్రోల్ చేసారు.

నెటిజ‌న్స్ ట్రోల్స్‌పై హేమాంగి కూడా ఘాటుగా స్పందించింది. మరాఠీలో వ్రాసిన నోట్‌లో, హేమంగి కవి తన ఇంట్లో, బయట లేదా సోషల్ మీడియాలో అండర్ గార్మెంట్ (బ్రా) ధరించాలా అనేది తన ఆప్షన్ అని అన్నారు. “అవును, నాకు రొమ్ములు ఉన్నాయి, పురుషుల మాదిరిగానే అవి ఉంటాయని పేర్కొంది. నేను పాలిచ్చి పెంచే జాతికి చెందిన దానిని కాబట్టి నా కాళ్ళు మరియు చేతులు కదిలేటప్పుడు నా వక్షో*లు కదులుతాయి. అలాంటి జాతికి మగజాతి నమస్కరించాలి’ అంటూ హేమాంగి పోస్ట్ చేసింది.

హేమాంగి ధైర్యంగా మాట్లాడడంపై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. హేమాంగి ధైర్యాన‌ని ప్ర‌వీణ్ టార్డే అనే ద‌ర్శ‌కుడు కూడా ప్ర‌శంసించారు. చాలా బాగా చెప్పావు అని కొంద‌రు మ‌హిళ‌లు కామెంట్స్ చేశారు.