దారుణం : కాల్ సెంటర్ లో పని చేస్తున్న ప్రముఖ నటి

NQ Staff - September 22, 2022 / 10:09 AM IST

దారుణం : కాల్ సెంటర్ లో పని చేస్తున్న ప్రముఖ నటి

Ekta Sharma : కరోనా ఎంతో మంది జీవితాలను తల కిందులు చేసిన విషయం తెలిసిందే. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన కరోనా వెళ్లి పోయిన తర్వాత కూడా ఆ ఇబ్బందులు కంటిన్యూ అవుతున్నాయి. ఉత్తరాది బుల్లి తెర నటి ఏక్తా శర్మ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. అందుకు కారణం కరోనా అంటూ ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Actress Ekta Sharma Ding Job in Call Cencer

Actress Ekta Sharma Ding Job in Call Cencer

ఆ సమయంలో అవకాశాలు లేకపోవడంతో తాను అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా ఆమె పేర్కొంది. చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కాల్ సెంటర్ జాబ్ జాయిన్ అయ్యాను. ఆ జాబ్‌ వల్ల తన అవసరాలు కొంత మేరకైనా తీరుతున్నాయి, అందుకే జాబ్ కంటిన్యూ అవుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

అద్దె ఇంట్లో నివసిస్తున్న తను కనీసం అద్దె చెల్లించ లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కాల్ సెంటర్లో జాబ్ చేసేందుకు సిద్ధమైనట్టు చెప్పుకొచ్చింది. కాల్ సెంటర్లో జాబ్ చేయడం తప్పనిపించలేదు, అదేం పెద్ద తప్పుడు విషయం అని కూడా నేను అనుకోవడం లేదు.

ఎవరో ఒకసారు వచ్చి సాయం చేస్తారు… ఏదో అద్భుతం జరుగుతుందని నేనెప్పుడూ ఎదురు చూడలేదు. అందుకే కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో కాల్ సెంటర్ జాబ్లో జాయిన్ అయ్యాను. మళ్లీ నటిగా బిజీ అవుతానని ఆశిస్తున్నాను. హిందీలో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన ఏక్తా శర్మ మళ్లీ నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us