Actress: భ‌ర్త శారీర‌క వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్న నటి

Actress: ఈ రోజుల్లో సామాన్యులకు, సెల‌బ్రిటీలకు భ‌ర్త‌ల వేధింపులు తప్ప‌డం లేదు. కొంద‌రు మృగాళ్లు పెళ్లి త‌ర్వాత భార్య‌ని అనుమానంతోనో లేదంటే క‌ట్నం కోస‌మ‌నో రాచిరంపాన పెడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు తీసేందుకు కూడా వెన‌కాడడం లేదు. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుండ‌గా, వీటిపై ప్ర‌భుత్వాలు గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Actress Divorce Due to Personal Issues
Actress Divorce Due to Personal Issues

సినిమా, సీరియ‌ల్ ఆర్టిస్టులు సైతం భ‌ర్త‌ల వేధింపుల‌కు గురైన సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో పెళ్లైన కొద్ది రోజుల‌కే విడాకులు తీసుకున్నారు. తాజాగా ఓ న‌టి త‌న భ‌ర్త వ‌ల‌న ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించి కంట క‌న్నీరు పెట్టించింది. వివ‌రాల‌లోకి వెళితే రేడియో జాకీగా కెరీర్‌ ఆరంభించిన విలాసిని తర్వాత యాంకర్‌గా సత్తా చాటింది. తన హోస్టింగ్‌తో పలు షోలను విజయవంతంగా నడిపించిన ఆమె తనలోని నటనా కోణాన్ని వెలికి తీస్తూ బుల్లితెర మీద కూడా సత్తా చాటింది.

సాయి ప్ర‌కాశ్ అనే వ్య‌క్తిని విలాసిని వివాహం చేసుకోగా, ఎక్కువ కాలం వీరి బంధం నిల‌వ‌లేదు. ఏదో ఒక విష‌యంలో చిన్న‌పాటి గొడ‌వ‌లు వ‌స్తుండేవి. దీంతో కొంత కాలానికే విడివిడిగా ఉండ‌డం మొద‌లు పెట్టారు. కొన్ని రోజుల‌కు విడాకులు కూడా తీసుకున్నారు. అయితే విడాకుల‌పై స్పందించిన విలాసిని… తన భర్త అకృత్యాలను వివరించింది. అతడు ఎన్నో దుర్మార్గపు పనులు చేశాడని చెప్పింది.

కోపం వ‌స్తే జాడ లేకుండా ఎక్క‌డికో వెళ్లిపోయేవాడు. మాన‌సికంగా, శారీర‌కంగా వేధించేవాడు. నా ద‌గ్గ‌ర నుండే పేరెంట్స్ ద‌గ్గ‌ర నుండి ఊరికే డ‌బ్బులు గుంజుతూ క్షోభ‌కు గురి చేసేవాడు. ఈ బాధ‌లు భ‌రించ‌లేక విడాకులు తీసుకున్నాను. ప్ర‌స్తుతం సింగిల్ గా సంతోషంగా ఉన్నాను.యాక్టింగ్‌పైన పూర్తి దృష్టి పెట్టాల‌ని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది విలాసిని. అయితే ఈ విలాసిని ఎవ‌రో కాదు, ఇళయరాజా భార్య సోదరుడి కూతురు. యువన్‌ శంకర్‌ రాజా, వెంకట్‌ ప్రభు కజిన్‌గా అందరికీ సుపరిచితురాలు.