Actress: హాట్ కంటెంట్ కోసం 20 లక్షలు అదనంగా డిమాండ్ చేస్తున్న హీరోయిన్.!
NQ Staff - May 3, 2022 / 09:41 PM IST

Actress: హీరోయిన్గా వెలిగిపోదామనుకున్న ఆ బొద్దుగుమ్మ, అనూహ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనదగ్గ పాత్రలకు పరిమితమైపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె బుల్లితెర వైపు మళ్ళింది. ఇప్పుడామెకు ఓటీటీ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

Actress Demanding Extra 20 Lakhs for Bold Characters
ఇటు సినిమాల్లోనూ, అటు బుల్లితెరపై పలు షోస్‌లోనూ కనిపిస్తోన్న సదరు బొద్దుగుమ్మ, ఓటీటీ పట్ల కాస్త ఎక్కువ మక్కువ చూపుతోందిట. కాకపోతే, తనకు మామూలుగా ఇచ్చే రెమ్యునరేషన్‌కి అదనంగా 20 లక్షలు సమర్పించుకుంటే, ఓటీటీ కంటెంట్ చేస్తాననీ, గ్లామర్ విషయంలో హద్దులేవీ వుండవనీ అంటోందట ఆ బ్యూటీ.
నిజమే, ఓటీటీ చాలామంది అందాల భామలకు మంచి వేదికగా మారుతోంది. అక్కడ గ్లామర్ విషయంలో హద్దులేమీ వుండడంలేదు. పైగా, రిపీట్ ఆడియన్స్ ఓటీటీ కంటెంట్‌కి ఎక్కువ వుంటారు. అలా నటీమణుల పాపులారిటీ ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అనే స్థాయిలో వుంటుంది.
ఓటీటీ విషయంలోనే కాదు, సినిమాల్లో నటించినా గ్లామర్ కంటెంట్ ఎక్కువైతే 20 లక్షలు అదనం.. అనే రూల్ ఆ బ్యూటీ పెట్టిందని అంటున్నారు. ఈ కోవలోనే ఆమెకు కొన్ని సినిమా ఛాన్సులు.. అవీ చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు వచ్చాయని సమాచారం.
ఇంతకీ ఎవరా బొద్దుగుమ్మ.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. కొద్ది రోజులు ఆగితే ఆ విషయం బయటపడే అవకాశాలూ లేకపోలేదు.