Aparna Balamurali : వీడిని ఎలా తన్నాలి… ఫ్యాన్ ని అంటూ హీరోయిన్ తో అసభ్య ప్రవర్తన
NQ Staff - January 20, 2023 / 07:17 AM IST

Aparna Balamurali : అభిమానం పేరుతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్న సందర్భాలు చాలా ఉంటాయి. ఇటీవల కొందరు హీరోయిన్స్ ని పదే పదే ఆకతాయిలు వేధించడం కామన్ అయ్యింది.
ఆకాశమే నీ హద్దురా సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుని, జాతీయ స్థాయిలో అవార్డును సొంతం చేసుకున్న నటి అపర్ణ బాలమురళికి ఒక కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురయింది.
ఆమెను ఒక అభిమాని ఫోటో దిగుతానంటే దగ్గరికి వచ్చి మీద చెయ్యి వేయబోయాడు. అసభ్యంగా ప్రవర్తించిన అతడు తీరుకు షాక్ అయినా అపర్ణ కొన్ని నిమిషాల పాటు అలాగే చూస్తూ ఉండి పోయింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి వాడిని ఎలా కొట్టిన తప్పులేదు అంటూ కొందరు విమర్శిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం అభిమానానికి హద్దు ఉండాలి, ఇలాంటి వారి పట్ల సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు.
అపర్ణ బాలమురళి ఆకాశమే నీ హద్దురా సినిమా తర్వాత పెద్దగా సందడి చేయడం లేదు. అయినా కూడా ఆమెకు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతమైంది. తెలుగులో కూడా ఈమె నటించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.