Anjali: ఇప్ప‌ట్లో పెళ్లి జోలికి వెళ్ల‌నంటున్న వ‌కీల్ సాబ్ హీరోయిన్

Anjali: ఈ మధ్య ఏ హీరోయిన్ చూసినా కూడా సైలెంట్ గా పెళ్లి చేసుకుంటుంది. అందుకే ఎప్పుడు ఏ హీరోయిన్ పెళ్లి కబురు వినాల్సి వస్తుందో కూడా అభిమానులకు అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే మరో హీరోయిన్ పెళ్లి కూడా అయిపోతుందని ప్రచారం జరిగింది. చాలా ఏళ్లుగా ఈమె పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి కానీ అందులో నిజం మాత్రం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఈ పెళ్లి వార్తలు అంజలి గురించి వచ్చాయి. వకీల్ సాబ్ సినిమా తర్వాత మరోసారి ఈమె కెరీర్ కు రెక్కలు వచ్చాయి. వరస అవకాశాలు వస్తుండటంతో మళ్లీ బిజీ అయిపోయింది అంజలి.

Actress Anjali Not Ready to Marry Soon
Actress Anjali Not Ready to Marry Soon

ఈ క్రమంలోనే తెలుగు, తమిళంలో ఖాళీ లేకుండా ఉంది ఈ రాజోలు సుందరి. తెలుగమ్మాయి అయినా కూడా ఇప్పటి వరకు తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ హోదా అందుకోలేదు అంజలి. వెంకటేష్, బాలయ్య లాంటి హీరోలతో నటించిన తర్వాత కూడా ఈమెను మన దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు పవన్ సినిమాలో నటించిన తర్వాత పర్లేదు అనే అవకాశాలు వస్తున్నాయి. ఈమె కొన్నేళ్లుగా తమిళ హీరో జై తో ప్రేమలో ఉంది. అతడినే పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని నెలల కింద ఈ ఇద్దరూ విడిపోయారు. గతేడాది లాక్ డౌన్ సమయంలోనే జైతో ప్రేమకు అంజలి గుడ్ బై చెప్పిందనే వార్తలున్నాయి.

ఈ క్రమంలోనే ఓ బిజినెస్ మ్యాన్ ను అంజలి పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దాంతో ఈమె తన పెళ్లిపై వస్తున్న వార్తలను ఖండించింది. అలాంటిదేం లేదని.. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. తనకు ఇప్పుడు సినిమాలు తప్ప మరో ఆలోచనే లేదని తేల్చేసింది అంజలి. కచ్చితంగా పెళ్లి చేసుకునేటప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటానని చెప్పుకొచ్చింది అంజలి. మొత్తానికి తన పెళ్లి వార్తలు మాత్రం అబద్ధమే అని క్లారిటీ ఇచ్చింది అంజలి.