సినీ నటి, ఎంపీ నవనీత్ కు కరోనా పాజిటివ్

Admin - August 7, 2020 / 05:28 AM IST

సినీ నటి, ఎంపీ నవనీత్ కు కరోనా పాజిటివ్

కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. దేశంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా భారిన పడగా, మరి కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా కరోనా భారిన పడ్డారు. ఇప్పుడు తాజగా నటి, అమ్రావతి ఎంపీ నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె నివాసంలోని మొత్తం 11 మంది కరోనా భారిన పడ్డారు. మొదటగా నవనీత్ మామా గంగాధర్ కరోనా భారిన పడ్డారు. తరువాత నవనీత్ కు, ఆమె భర్త రాణాకు కరోనా టెస్టులు చేయగా నవనీత్ కు పాజిటివ్ వచ్చింది .

నవనీత్ కు పాజిటివ్ రావడంతో ఆమె సిబ్బందిని, కార్యకర్తలకు కూడా కరోనా టెస్టులు చేయగా, 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దింతో నవనీత్ ఇంటిని వైద్య శాఖ అధికారులు శుభ్రం చేయించారు. 2019 లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నవనీత్ విజయం సాధించింది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us