Actress: అనారోగ్యంతో ఆసుప‌త్రిలో.. సాయం కోసం ఎదురు చూస్తున్న పాపుల‌ర్ న‌టి

Actress: ఒక్కోసారి బండ్లు ఓడ‌లు, ఓడ‌లు బండ్లు అవ‌డం ఖాయం. ఒక‌ప్పుడు ఎంత బాగా బ‌తికినా కొన్ని రోజుల త‌ర్వాత ఏదో ఒక ప‌రిస్థితిలో న‌లుగురిని యాచించ‌క త‌ప్ప‌డం లేదు. సినిమా వాళ్ల ప‌రిస్థితి అయితే మ‌రి దారుణం. ఒక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కి వినోదాన్ని అందిస్తూ చేతి నిండా డ‌బ్బులు సంపాదిస్తున్న ఆర్టిస్టులు కొంద‌రు ఇప్పుడు వారి వైద్యానికి డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టుకునే స్థితిలో లేకుండా ఉన్నారు.

Actress Anaya Aoni Seeks Financial Aid After Kidney Failure
Actress Anaya Aoni Seeks Financial Aid After Kidney Failure

తాజాగా తాజాగా ఓ ప్రముఖ బుల్లితెర నటి కూడా తనకు సాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తుంది. ఆమె పేరు అనయా సోని. హిందీలో పాపులర్ నటి ఈమె. తెలుగు వాళ్లకు పరిచయం లేకపోయినా కూడా హిందీలో మాత్రం బాగానే పాపులర్ ఈమె. అక్కడ నామ్ కరణ్, క్రైమ్ పెట్రోల్ లాంటి క్రేజీ సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది అనయా.

కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతుంది అనయా సోనీకి ఇప్పుడు ఆ స‌మ‌స్య మ‌రితం తీవ్రంగా మారింది. ఈ మధ్యే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పుకొచ్చింది. 2015 నుంచి తాను ఒక్క కిడ్నీతోనే ఉన్నానని.. తన రెండు కిడ్నీలు 6 సంవత్సరాల క్రితం ఫెయిల్ అయ్యాయని చెప్పింది ఈమె. అయితే ఆ సమయంలో తన నాన్న తన కిడ్నీని దానం చేశారని.. అయితే అది కూడా ఇప్పుడు పని చేయడం లేదని కన్నీటి పర్యంతం అయింది.

ప్ర‌స్తుతం త‌ను బ్ర‌త‌కాలి అంటే కిడ్నీ మార్పిడి చేయించుకోవ‌డం ఒక్క‌టే ఆప్ష‌న్. ఇది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. మా అమ్మ‌కు క్లాత్ స్టోర్ ఉండేది. అది ఇటీవ‌ల మంటల్లో కాలిపోయింది. దీంతో అందులో ఉన్న బట్టలు, మెషీన్లు అన్నీ బూడిదైపోయాయని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో తనకు డయాలిసిస్‌ జరగాల్సి ఉందని.. కానీ కిడ్నీ దాత కోసం చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన వివరాలతో ట్వీట్ చేసింది అనయా సోనీ.

నామ్‏కరన్, క్రైమ్ పెట్రోల్ లాంటి సీరియల్స్‌తో బాగా గుర్తింపు తెచ్చుకున్న అన‌యా ఆ సమయంలో ఆర్థికంగా కూడా బాగానే ఉంది అనయా. సొంత డ‌బ్బుల‌తోనే కొన్ని రోజులు ట్రీట్‌మెంట్ చేయించుకుంది. ఇప్పుడు ఆమె ప‌రిస్థితి దారుణంగా మారింది. తినడానికి తిండి కూడా లేని గడ్డు పరిస్థితుల్లో ఉంది ఈమె కుటుంబం. ముంబైలోని హూలీ స్పిరిట్ ఆసుపత్రిలో చెర్పించి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్‌మెంట్‌కి భారీగా డ‌బ్బులు అవ‌స‌రం ఉంది. కాని అంత ఖ‌ర్చు పెట్టే ప‌రిస్థితిలో వారి కుటుంబ లేదు. అందుకే వారు సాయం కోసం ఎదురు చూపులు చూడ‌క త‌ప్ప‌డం లేదు.