Soundarya: సౌంద‌ర్య ఇంటికి ఇలాంటి దుస్థితి ప‌ట్టిందా..?

Samsthi 2210 - July 1, 2021 / 04:08 PM IST

Soundarya: సౌంద‌ర్య ఇంటికి ఇలాంటి దుస్థితి ప‌ట్టిందా..?

Soundarya: తెలుగు సినీ ప‌రిశ్రమ‌లో మ‌హాన‌టి సావిత్రి త‌ర్వాత అంతే రేంజ్‌లో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన న‌టి సౌంద‌ర్య‌. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఎన్నో సినిమాలు చేసిన ఏనాడు కూడా ఎక్స్‌పోజింగ్ వైపు దృష్టి పెట్ట‌లేదు. చాలా ప‌ద్ద‌తిగా, అణుకువ‌గా ఉన్న పాత్ర‌ల‌నే పోషించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. దాదాపు అప్ప‌టి స్టార్ హీరోలంద‌రితో న‌టించిన సౌంద‌ర్య ఓ ప్రమాదంలో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే

Actress Aamani Talks About Soundarya House

Actress Aamani Talks About Soundarya House

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించిన సౌంద‌ర్య చ‌నిపోయి దాదాపు 17 ఏళ్లు కావొస్తుంది. అయిన‌ప్ప‌టికీ ఆమె జ్ఞాపకాలు ఇంకా అభిమానుల మదిలో మెద‌లుతూనే ఉన్నాయి. సౌంద‌ర్య చ‌నిపోయే నాటికి ఆమె వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే.. పైగా పెళ్లై ఏడాది కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం నింపేసింది.

ప్ర‌చార కార్య‌క్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న క్ర‌మంలో హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో సౌంద‌ర్య క‌న్నుమూసింది. సౌంద‌ర్య మంచి న‌టిగానే కాదు సేవా త‌త్ప‌ర‌త ఉన్న న‌టిగా ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకుంది. త‌న సోద‌రుడు తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సౌంద‌ర్య‌ కర్ణాటకలో మెడికల్ కాలేజీతో పాటు స్కూల్స్ ను స్థాపించి ఉచిత విద్యను అందించి గొప్ప మనసు చాటుకున్నారు.

సౌంద‌ర్య లేక‌పోయిన కూడా ఇప్ప‌టికీ సౌందర్య కుటుంబం ఆర్ధిక సాయం చేస్తూనే ఉన్నార‌ట‌. అయితే చిన్న‌ప్పుడే సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చిన సౌంద‌ర్య బాగానే వెనకేసింది. అప్ప‌టి లెక్కల ప్ర‌కారం సౌందర్యకు 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గతంలో ఆమె కుటుంబ సభ్యులే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల నటి ఆమని కూడా ఓ ఇంటర్వ్యూలో సౌందర్య ఆస్తుల గురించి ప్రస్తావించారు.

సౌంద‌ర్య నాకు ప్రాణ స్నేహితురాలు. సౌందర్య మ‌ర‌ణించిన విష‌యం ఇప్ప‌టికీ క‌ల‌గానే ఉంది. కొద్ది రోజుల క్రితం నేను బెంగ‌ళూరులో ఉన్న సౌంద‌ర్య బంగ్లాకు వెళ్లాను. ఎంతో ఇష్ట‌ప‌డి ఆ బంగ్లాను సౌంద‌ర్య కొనుక్కోగా అది ఆమె బ‌తికున్న రోజుల‌లో దేధీప్య‌మాన్యంగా వెలిగేది. కాని ఇప్పుడు బూత్ బంగ్లాలా మారింద‌ని ఆమ‌ని పేర్కొంది.

కొద్ది రోజుల కిందట వ‌ర‌కు బంగ్లాలో సౌంద‌ర్య త‌ల్లి ఉండేవారు. ఇప్పుడు ఎవ‌రు లేక‌పోవ‌డంతో బంగ్లా బూత్ బంగ్లాలా క‌న‌పించిన‌ట్టు క‌న్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా సౌందర్య పేరుతో బయోపిక్ వస్తుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. కీర్తి సురేష్ కాదంటే నిత్యామీన‌న్ పేరు ప‌రిశీలించ‌నున్నారు.

Read Today's Latest Entertainment in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us