Uttej Wife Died: ఉత్తేజ ఇంట విషాదం.. స‌తీమ‌ణి క‌న్నుమూత‌

Uttej Wife Died: సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస విషాదాలు వెంటాడుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు వారి ఫ్యామిలీ కుటుంబ స‌భ్యులు కాలం చేయ‌డం విషాదాన్ని క‌లిగించింది. ఇటీవ‌ల సాయి ధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదానికి గురి కాగా, ఆయ‌న ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాలాని పూజలు చేస్తున్నారు. అందరు ఈ సంఘ‌ట‌న గురించే త‌ల‌చుకుంటూ బాధ‌ప‌డుతుండ‌గా, ఇప్పుడు ఉత్తేజ్ ఇంట విషాదం నెల‌కొంది.

Actor Uttej Wife Died due to Ill health
Actor Uttej Wife Died due to Ill health

ప్రముఖ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి సోమవారం ఉదయం కన్నుమూశారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.

న‌టుడు ఉత్తేజ్ పేరు వింటే ఇప్ప‌టికీ ఆయ‌న తొలి చిత్రం శివ‌లోని యాద‌గిరి పాత్ర‌నే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా మొద‌టి సినిమాలోనే క‌నిపించింది కొన్ని నిమిషాలే అయినా, త‌న ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్నారు ఉత్తేజ్. రామ్ గోపాల్ వ‌ర్మ అప్ప‌టి నుంచీ తాను రూపొందించిన ప‌లు చిత్రాల‌లో ఉత్తేజ్ కు అవ‌కాశాలు క‌ల్పించారు. గాయం, అన‌గ‌న‌గా ఒక‌రోజు చిత్రాల‌లోనూ ఉత్తేజ్ యాద‌గిరిగానే క‌నిపించి ఆక‌ట్టుకోవ‌డం విశేషం.

ఎంతోమంది హీరోల‌కు ఉత్తేజ్ ఫ్రెండ్ గా న‌టించి మెప్పించారు. శ్రీ‌కాంత్, జేడీ చ‌క్ర‌వ‌ర్తితో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా ప‌లు చిత్రాల‌లో స్నేహితునిగా న‌టించి అల‌రించారు. ఇక టాప్ హీరోల చిత్రాల్లోనూ ఉత్తేజ్ కు త‌గిన పాత్ర‌లే ల‌భించాయి. త‌న ద‌రికి చేరిన పాత్ర‌ల్లోకి ఇట్టే ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేయ‌గ‌ల స‌త్తా ఉత్తేజ్ సొంతం. ప్ర‌స్తుతం కేరెక్ట‌ర్ యాక్ట‌ర్ గా రాణిస్తున్న ఉత్తేజ్, ఆ మ‌ధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ టాక్సీవాలాలో విల‌న్ గానూ న‌టించాడు.