Prabhakar : కొడుకు ట్రోల్స్‌పై నటుడు ప్రభాకర్ ఏమన్నారంటే.!

NQ Staff - September 23, 2022 / 09:29 AM IST

160253Prabhakar : కొడుకు ట్రోల్స్‌పై నటుడు ప్రభాకర్ ఏమన్నారంటే.!

Prabhakar : బుల్లితెర మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్, తాజాగా తన ముద్దుల తనయుడి చంద్రహాస్‌ని హీరోగా పెద్ద తెరకు పరిచయం చేశాడు. బుల్లితెరతో పాటూ, పెద్దతెరకి సంబంధించిన ప్రముఖులతో ప్రబాకర్‌కి మంచి అనుబంధం వుంది. ఆ అనుబంధంతోనే, కొడుకును పెద్ద తెరకు హీరోగా పరిచయం చేశాడు. తనయుడు చంద్రహాస్ హీరోగా మొదటి సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

Actor Prabhakar Respond about his son Chandrahass Trolls

Actor Prabhakar Respond about his son Chandrahass Trolls

ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో తన కొడుకును తెగ ట్రోలింగ్ చేశారనీ ప్రభాకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంట్రడక్షన్‌లోనే ఇంతలా ట్రోల్ చేసేశారేంటా.? అని ఆయనే ఆశ్చర్యపోయారట. ఇలా నిలబడ్డాడేంటీ.? అలా చూస్తున్నాడేంటీ.? జేబులో చేయి పెట్టాడేంటీ.? అంటూ రకరకాలుగా చంద్రహాస్‌ని ట్రోల్ చేశారు ఇటీవల సోషల్ మీడియాలో నెటిజన్లు. హీరోగా తొలి సినిమాకే ఇంత ఆటిట్యూడ్ చూపించాలా.? ఎంత బుల్లితెర మహానటుడి కుమారుడైతేనేం.. అంటూ ఓ లెవల్లో ట్రోల్ చేశారు చంద్రహాస్‌ని.

నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నో ప్రాబ్లమ్.. ఇదే విషయమై ప్రబాకర్‌ని అడగ్గా, ఇలా ట్రోల్ చేయడం కూడా ఒక రకంగా మంచిదే. ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది. ప్రత్యేకంగా వాడ్నినేను ప్రమోట్ చేసే అవసరం లేదు.. అందరికీ ఈజీగా తెలిసిపోయాడు.. అని మొట్ట మొదటిసారిగా తనయుడి గురించి నటుడు ప్రభాకర్ స్పందించిన తీరు నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. అంతేగా.. తిట్టినా, పొగిడినా అదో ట్రెండింగే నయా డేస్‌లో.

అలా ప్రభాకర్ కొడుకు చంద్రహాస్‌కి వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్.. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మా మంచికే అంటున్నారు నటుడు ప్రభాకర్. ఇప్పుడు తిట్టిన వాళ్లే రేపు, వాడు బాగా నటిస్తే, వాళ్లే ఆదరిస్తారు. వాడి యాక్టింగ్ నచ్చితే, ఆకాశానికెత్తేస్తారు.. అని తనయుడి విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాన్ని ముందుగానే గెస్ చేసేశారు నటుడు ప్రభాకర్. ఎంతైనా సీనియర్ నటుడు కదా.! ఆ విజన్ వుంటుంది మరి.