Poonam Kaur: తప్పు లేక‌పోయినా, చ‌స్తూ బ్ర‌తికాను.. క‌త్తి మ‌హేష్ ద‌ళితుడు అంటూ పూన‌మ్ కామెంట్స్

Poonam Kaur: సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణాన్ని ఎవ‌రు ఊహించ‌లేదు. కోలుకొని వ‌స్తాడ‌ని అంద‌రు అనుకుంటున్న స‌మ‌యంలో మ‌హేష్ ఇలా అకాల మ‌ర‌ణం చెంద‌డం చాలా మందిని బాధించింది. ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాతి రోజు నుండి క‌త్తి మ‌హేష్ ఆరోగ్యం గురించి అభిమానులు, స‌న్నిహితులు ఆరా తీస్తూనే ఉన్నారు. ప్రాణాపాయం లేద‌నే అనుకున్నారు. కుటుంబ స‌భ్యులు కూడా అదే చెప్పారు. కాని ఇలా అకాల మ‌ర‌ణం చెందడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు.

Kathi Mahesh, Poonam Kaur
Kathi Mahesh, Poonam Kaur

క‌త్తి మ‌హేష్.. తన సొంతూరు పీలేరు నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు చెన్నై, నెల్లూరు మార్గమధ్యంలో ఆగివున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. అయితే ఆయన సీటు బెల్ట్ పెట్టుకోవడంతో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. కానీ కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు.
ముందు నెల్లూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నై హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు.

కడవరకు కూడా కాంట్రవర్సీలతోనే కాపురం చేసిన క‌త్తి జర్నలిజం బ్యాగ్రౌండ్ నుంచి బిగ్ బాస్ హౌజ్ కు వెళ్లి.. అక్కడ ఐదు వారాలు ఉండి బయటికి వచ్చాడు కత్తి. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి హైలైట్ అయ్యాడు. రాముడు, సీత‌పై కామెంట్స్ చేసి బ‌హిష్క‌ర‌ణ‌కు కూడా గుర‌య్యాడు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో మ‌హేష్‌, పూన‌మ్ కౌర్ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం, సోషల్‌మీడియాలో ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోస్ట్‌లు చేయడం జరిగింది.

క‌త్తి మ‌హేష్ అంటే నాగుపాములా బుస్సున లేచే పూన‌మ్.. ఇటీవ‌ల ఆయ‌న‌కు యాక్సిడెంట్ అయిన సంద‌ర్భంలో సంచ‌న‌ల ట్వీట్ చేసింది. ‘రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్, వదిలేశావ్. ఏళ్ల నుంచి పద్దతిగా నా పని నేను చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని.. నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను.. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావ్ అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్’ అని త‌న ట్వీట్ లో పేర్కొంది.

ఇక క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణం త‌ర్వాత పూన‌మ్ మ‌రో ట్వీట్ చేసింది. నా త‌ప్పు లేకున్నా, ప్ర‌తి రోజు చ‌స్తూ బ్ర‌తికారు. ఇప్పుడు అనిపిస్తుంది. ఇన్ని రోజులుగా నాకు ఇలా ఎందుకు జ‌రిగింది అని, ఒక రాజకీయ పార్టీ తమ పరువు కోసం బలవంతంగా ఒక దళితుడిని.. పూర్తిగా దుర్వినియోగం చేసుకుంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. ఆ పేరుని మ‌ళ్లీ ప్ర‌స్తావించను అంటూ
పూన‌మ్ త‌న ట్వీట్‌లో పేర్కొంది.