Trivikram: ఈ యాక్టర్ త్రివిక్రమ్ సూపర్ హిట్ మూవీకి సినిమాటోగ్రాఫరన్న విషయం మీకు తెలుసా..?

Trivikram ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌లో మారి సెల్వ‌రాజ్ తెర‌కెక్కించిన చిత్రం క‌ర్ణ‌న్. అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ చిత్రం అంద‌రిని ఆక‌ట్టుకుంది. త‌మిళ‌నాడులోని మారుమూల గ్రామం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం 1995 కాలం నాటి క‌థ‌ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించింది. వి. క్రియేష‌న్ ప‌తాకంపై క‌లైపులి ఎస్‌థాను నిర్మించిన ఈ చిత్రంలో రాజిషా విజయన్ హీరోయిన్‌గా న‌టించ‌గా లాల్, నటరాజన్ సుబ్రహ్మణ్యం, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా న‌ట‌రాజ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్యం పోలీస్ ఆఫీస‌ర్‌గా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఆయ‌న న‌ట‌న‌కు విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు కూడా ల‌భించాయి. అయితే ఆయ‌న అఆ, రంజానా, జ‌బ్ వుయ్ మెట్, సీఎంఆర్ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

natarajan subramaniam Trivikram

బన్నీ, పవన్, మహేష్ బాబు వంటి హీరోల‌తో సినిమాలు చేస్తుండే త్రివిక్ర‌మ్ నితిన్ హీరోగా అఆ అనే సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే . సమంత, అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. తన మాతృ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం 2016 జూన్ 2న విడుదలైంది. నితిన్ కెరీర్లో ఈ రోజుకు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాగా, రీసెంట్‌గా ఈ చిత్రం ఐదేళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలోని ప్ర‌తి స‌న్నివేశాన్ని చాలా చ‌క్క‌గా చూపించింది క‌ర్ణ‌న్ న‌టుడు న‌ట‌రాజ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్యం. ఆయ‌న కెమెరా పనితనం వ‌ల‌న సినిమా చూస్తున్నంత సేపు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంటుంది. ఎంతో టాలెంట్ ఉన్న ఈ సినిమాటోగ్రాఫ‌ర్‌ని మ‌హేష్ 28వ సినిమాకు కూడా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.

మహేష్ కెరియర్ లో 28వ సినిమా గా వస్తున్న చిత్రంపై అంద‌రిలో భారీ అంచ‌నాలు ఉన్నాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకోసం త్రివిక్రమ్,మ‌హేష్‌లు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇక సినిమా న‌టీన‌టులతో పాటు టెక్నీషియ‌న్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నార‌ట‌. పాపుల‌ర్ టెక్నీషియ‌న్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతుండ‌గా, ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా న‌ట‌రాజ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్యం ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.