Naresh: శ్రీకాంత్‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్.. ఆలోచించి మాట్లాడు అని న‌రేష్ చుర‌క‌

Naresh: మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదం గురించి మా అధ్యక్షుడు నరేష్ చేసిన కామెంట్స్ ఎంత పెద్ద దుమారం రేపాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సాయంత్రం మా ఇంటి నుంచే బయలుదేరారు. బైక్ సౌండ్స్ విని వెళ్లేలోపే వారిద్దరూ బయల్దేరిపోయారు. బైక్ రైడింగ్ వద్దని తాను చాలాసార్లు సాయిని హెచ్చరించాను. బైక్ రైడింగ్ విషయంలో నాలుగు రోజుల క్రితం వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నా. బైక్ యాక్సిడెంట్‌లో కోట త‌న‌యుడు, బాబు మోహ‌న్ త‌న‌యుడు, నారాయ‌ణ త‌న‌యుడు చనిపోయారు , అందుకే పిల్ల‌ల‌కు బైక్‌లను దూరంగా ఉంచాల‌ని కామెంట్స్ చేశారు. నరేష్ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, నటుడు శ్రీకాంత్ మండిపడ్డారు.

Actor Naresh Fire on Srikanth
Actor Naresh Fire on Srikanth

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘‘సాయి ధరమ్ తేజ్ తిరిగి షూటింగ్స్ చేస్తారు. బ్రహ్మండంగా ఉంటారు. చిన్న ప్రమాదమే జరిగింది. ఈ సమయంలో నరేష్ ప్రమాదవశాత్తు మరణించినవారి పేర్లు చెప్పడం కరెక్టు కాదు. రేసింగ్ చేశాడు.. అది చేశాడు.. ఇది చేశాడని ఇప్పుడెందుకు మాట్లాడటం? ఇలాంటి సమయంలో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని పరమేశ్వరుడిని ప్రార్థించాలి’’ అని అన్నారు.

‘సాయి ధరమ్ తేజ్‌కు జరిగింది చాలా చిన్న యాక్సిడెంట్. సాధారణంగా జరిగే ప్రమాదమే. రోడ్డు మీద ఇసుక ఉండడంతో జారి పడిపోయాడు. ఆయన త్వరగా కోలుకుంటారు. నాకు తెలిసిన యంగ్ స్టర్స్‌లో సాయి ధరమ్ తేజ్ చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తుంటాడు. తను ర్యాష్‌గా వెళ్లే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి గురించి ఈ టైమ్‌లో ఇలా మాట్లాడకూడదు. కుటుంబసభ్యులంతా టెన్షన్‌లో ఉన్నారు. మనం పెట్టే బైట్లు ఆ కుటుంబాన్ని ఇంకా టెన్షన్ పెడతాయి.

న‌రేష్ గారు ఈ టైమ్‌లో.. చనిపోయిన వాళ్ల గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. దయచేసి అలాంటి బైట్లు ఎవరూ పెట్టకూడదని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. శ్రీకాంత్ వ్యాఖ్యలపై నరేష్ తాజాగా ఓ వీడియో విడుద‌ల చేశారు. నా వ్యాఖ్యల మీద నువ్వు ఇచ్చిన బైట్ చూశా. ఏంటమ్మా అలా ఇచ్చావ్ బైట్? ప్రమాదం సమయంలో సాయి ధరమ్ తేజ్ స్పీడ్‌లో లేడు. బురదలో జారి పడ్డాడు. నేను చెప్పినదానికి మీడియాలో తేడాగా వస్తే.. వెంటనే నేను ఏం చెప్పాలో అది చెప్పేశాను.

చనిపోయినవాళ్ల గురించి నేను చెప్పలేదు. ఇండస్ట్రీ గురించి చెప్పాను. బైకులను చాక్లెట్లుగా ఇవ్వం. బైట్స్ ఇచ్చే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇండస్ట్రీలో జరిగిందే చెప్పాను. ప్రమాదాలు నాకూ జరిగాయి. చాలామందికి జరిగాయి. నువ్వు ఆ విధంగా మాట్లాడటం హర్ట్ చేసింది. నా కళ్ల ముందు నిన్ను హీరోగా రావడం చూశాను. మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నావు. మా ఎన్నికల్లో పోటీ చేసి.. మా ప్యానెల్ మీద ఓడిపోయావు. దయచేసి అలాంటి బైట్స్ ఇవ్వొద్దు’’ అంటూ నరేష్ వ్యాఖ్యానించాడు.

గత 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడు బైట్స్ ఇవ్వడంలో కాంట్రావర్సి, పొలిటికల్‌గా చెడ్డ పేరు లేదు. కానీ నువ్వు బైట్స్ ఇచ్చే ముందు ఆలోచించి, పెద్దవారితో మాట్లాడి ఇవ్వు’’ అంటూ న‌రేష్‌ చెప్పుకొచ్చాడు.