Actor Naresh: చిరంజీవి పై దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసిన న‌రేష్‌

Actor Naresh: మొన్న‌టి వ‌ర‌కు మా అధ్య‌క్షుడిగా ఉన్న న‌రే్‌ష్‌.. రీసెంట్‌గా జ‌రిగిన ఎన్నిక‌ల‌లో విష్ణుకి స‌పోర్ట్ చేసి గెలిపించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కొన్నిసార్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశారు.అయితే చిరంజీవిని ఉద్దేశించి ఆయ‌న చేసిన‌ కొన్ని వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి.ఇండ‌స్ట్రీలో చిరంజీవి మాత్రమే కాదు చాలా మంది పెద్దలు ఉన్నారని.. అన్నింటికీ చిరంజీవి ఒక్కడే పెద్ద అనడం సరైంది కాదని చెప్పాడు.

మా ఎన్నికల నేపథ్యంలో తనను తాను కృష్ణుడిగా పోల్చుకున్నాడు నరేష్. మంచు విష్ణు వైపు ఉండి చక్రం తిప్పుతున్నట్లు చెప్పుకొచ్చాడు ఈయన. అన్నట్లుగానే మంచు విష్ణు ఈ ఎన్నికల్లో విజయం సాధించాడు. ఎలక్షన్స్ అన్న తర్వాత అంతా ఇలాగే అరుచుకుంటారు.. ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత అంతా కలిసిపోతారని అంతా అనుకున్నారు. కానీ ఈ సారి వచ్చిన మనస్పర్థలు మాత్రం చాలా కాలం పాటు ఉండేలా కనిపిస్తున్నాయి.

సీనియర్ నరేష్ అందరిపై నోరు పారేసుకున్నాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ అయితే నరేష్ అంటేనే మండిపడుతున్నారు. ఈ రోజు మా అసోసియేషన్ మసక బారిందంటే కారణం నరేష్ అంటూ నాగబాబు సహా చాలా మంది విమర్శించారు. ఉత్తేజ్ అయితే ఉతికి ఆరేసాడు. నాగబాబు కూడా నరేష్ లాంటి చెత్త ప్రెసిడెంట్‌ను ఇప్పటి వరకు చూడలేదని.. కేవలం అతడి వల్లే ఇదంతా జరిగిందంటూ విమర్శించాడు.

మోహన్ బాబు ఉన్నాడనే ధైర్యమో ఏమో కానీ చిరంజీవిని సైతం ఢీ కొడుతున్నాడు. మంచు విష్ణు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మీడియా ముందుకొచ్చిన నరేష్.. దాసరి నారాయణరావు స్థానం గురించి మాట్లాడాడు. అప్పుడు పెద్దాయన పోయిన తర్వాత ఆ ప్లేస్ అలాగే ఉండిపోయిందని.. చాలా మంది ఆ స్థానం కోసం ప్రయత్నించినా కూడా ఎవరికీ దక్కలేదని చెప్పాడు నరేష్

దాసరి స్థానాన్ని భర్తీ చేసే ఆ అర్హతలు మోహన్ బాబుకు ఉన్నాయని చెప్పుకొచ్చాడు నరేష్. దాసరి గారు ఉన్నా కూడా ఈ రోజు మోహన్ బాబుకు ఆ బాధ్యతలు ఇచ్చేవాడని చెప్పాడు నరేష్. దాంతో పాటు ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే కాదు చాలా మంది పెద్దలు ఉన్నారని.. అన్నింటికీ చిరంజీవి ఒక్కడే పెద్ద అనడం సరైంది కాదని చెప్పాడు. త‌రాలు మా ర‌తాయి,ఆలోచ‌న‌లు మార‌తాయి,ఆచ‌ర‌ణ‌లు ఎప్పుడుఉండాలి.మాసేవా సంస్థ‌.ఎంతోమంది మ‌హానుభావులు వ‌చ్చి ఇటుక ఇటుక తీసుకెళ్లారు. క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో అన్ని ఉంటాయి అంటూ ఏవేవోమాట్ల‌డాడు. న‌రేష్ వ్యాఖ్య‌ల‌పై కొంద‌రు మండిప‌డుతున్నారు.