Naresh: న‌రేష్‌తో స‌న్నిహితంగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్.. సుధీర్ పోస్ట్‌తో పూర్తి క్లారిటీ

Naresh సెల‌బ్రిటీలు రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకోవ‌డం లేదంటే ఇత‌రుల‌తో రిలేష‌న్‌షిప్ చేయ‌డం కామ‌న్‌గా మారింది.గ‌తంలో ప‌రిశీలిస్తే సూప‌ర్ స్టార్ కృష్ణ తొలుత ఇందిరా దేవిని వివాహం చేసుకోగా, వీరికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు జ‌న్మించారు. కొద్ది రోజుల త‌ర్వాత కృష్ణ‌.. ఇందిరాని వ‌దిలేసి విజ‌య నిర్మ‌ల‌ని వివాహం చేసుకున్నారు. ఇటీవ‌ల ఆమె అకాల మ‌ర‌ణం చెంద‌డంతో కృష్ణ కాస్త డిప్రెష‌న్‌లో ఉన్నారు.

విజ‌య నిర్మిల త‌న‌యుడు న‌రేష్ కొద్ది రోజులుగా ప‌విత్ర అనే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌తో రిలేష‌న్ షిప్ మెయింటైన్ చేస్తున్నట్టు వార్త‌లు దావ‌నంలా వ్యాపించాయి. ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియ‌క అభిమానుల‌లో కొంత స‌స్పెన్స్ నెల‌కొంది. కాని ఈ రోజు మ‌హేష్ బావ సుధీర్ బాబు పోస్ట్‌తో కొంత క్లారిటీ అయితే వ‌చ్చింద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నాలుగు ప‌దుల వ‌య‌స్సు ఉన్న ప‌విత్ర తెలుగులో త‌ల్లిగా, వ‌దిన‌గా, అత్త‌గా ప‌లు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌లు పోషించింది. 80,90ల కాలంలో ఈమెకి మంచి గుర్తింపు ఉంది. అయితే ప‌విత్ర‌..న‌రేష్‌తో రిలేష‌న్ పిష్ మెయింటైన్ చేస్తుంద‌ని, కొన్నాళ్లుగా ఆయ‌న‌తోనే క‌లిసి ఉంటుంద‌ని పుకార్లు షికారు చేశాయి. అయితే దీనిపై పూర్తి క్లారిటీ లేక‌పోయిన అభిమానుల‌లో మాత్రం అనేక సందేహాలు నెల‌కొని ఉన్నాయి.

తాజాగా సుధీర్ బాబు త‌న సోష‌ల్ మీడియాలో ఫ్యామిలీతో స‌ర‌దా స‌మ‌యం అంట త‌న భార్య‌, సూప‌ర్ స్టార్ కృష్ణ‌, న‌రేష్‌, ప‌విత్ర‌తో క‌లిసి దిగిన ఫొటోలు షేర్ చేశాడు. ఇది చూసిన గాసిప్ రాయుళ్లు న‌రేష్‌, ప‌విత్ర క‌లిసి ఉంటున్నార‌నే వార్త‌లు వాస్త‌వం. ఇద్ద‌రు స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌న‌డం నిజం అంటూ త‌మ‌కు న‌చ్చిన‌ట్టు వార్త‌లు పుట్టిస్తున్నారు. మ‌రి దీనిపై కాల‌మే పూర్తి క్లారిటీ ఇస్తుంది.

ఇటీవ‌ల ప‌విత్ర ఓ కార్యక్రమంలో హాజరై నరేష్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మా అధ్యక్షుడు నరేష్‌ను కుంఫూ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించడం ప‌ట్ల‌ పవిత్రా సంతోషం వ్య‌క్తం చేస్తూ.. మా అధ్యక్షుడిగా నరేష్ ఎంతో గొప్పగా పని చేశారు. కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలోనూ అందరికీ పర్సనల్‌గా ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కున్నాడు. అలా ఇంకెవ్వరూ చేయలేదని పవిత్రా చెప్పుకొచ్చింది.