Actor Krishnudu: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కృష్ణుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Actor Krishnudu: న‌టుడు కృష్ణుడు హీరోగాను, స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌నోడికి ఆఫ‌ర్స్ త‌క్కువ‌య్యాయి. దీంతో బిజినెస్‌పై దృష్టి పెట్టాడు. అయితే తాజాగా కృష్ణుడు పేకాట కేసులో అరెస్ట్ అయిన‌ట్టు తెలుస్తుంది. కృష్ణుడుతో పాటు మ‌రో 8 మందిని అరెస్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.

Actor Krishnudu has been arrested
Actor Krishnudu has been arrested

మియాపూర్‌లోని ఓ విల్లాపై ఎస్‌వోటీ పోలీసులు నిన్న రాత్రి దాడులు చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న నటుడు కృష్ణుడు సహా 8 మందిని అరెస్టు చేశారు. పేకాటరాయుళ్లను మియాపూర్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. సొంత పూచీకత్తుపై నిందితులను పోలీసులు నిన్న రాత్రి ఇళ్లకు పంపించి వేశారు. ఇవాళ సాయంత్రం విచారణకు రావాలని వారిని ఆదేశించారు.

నటుడు కృష్ణుడు తో పాటు ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేయ‌గా, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు.. మియపూర్ పోలీసులు చాలా ప్లానింగ్ గా ఎటాక్ చేసి ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. వారివద్ద నుండి లక్షా 97 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 8 సెల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు.

కృష్ణుడు.. తెలుగు చిత్ర పరిశ్రమలో.. కామెడీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విలేజ్‌లో వినాయకుడు, హ్యాపీడేస్, యువత, షాక్, ఆర్య2, స్నేహగీతం, జ్యోతి లక్ష్మి తదితర సినిమాల్లో నటించాడు. కాగా ఆయన ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు. గ‌తంలో ఆయ‌న‌పై ఓ మ‌హిళ రేప్ కేసు పెట్టిన విష‌యం తెలిసిందే.

కృష్ణుడు త‌న‌ని రేప్ చేశాడ‌ని మ‌హిళ ఫిర్యాదు చేయ‌గా, ఆ త‌ర్వాత అదంతా అబద్దం అని చెప్పింది. అయితే త‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన స‌మ‌యంలో కృష్ణుడు స్పందిస్తూ.. “నాకు ఈ న్యూస్ తెలియగానే షాక్ అయ్యాను. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత హీరోగా, ఆర్టిస్ట్‌ చాలామందితో కలిసి పనిచేశాను. ఎప్పుడూ కూడా నాపై ఆరోపణలు లేవు. నాకు మందు అలవాటు లేదు.. సిగరెట్ అలవాటు లేదు. అలాంటి నాపై రేప్ ఆరోపణలు రావడం షాక్‌లోకి వెళిపోయా. ఈ విషయం మొదట నా భార్యకి చెప్పాను. నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడంతో నా భార్య.. నీ గురించి నాకు తెలుసు అని చెప్పింది.

నేను అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నా.. ఇక్కడ చాలామంది ఉంటారు. ఊర్లో అమ్మ ఒక్కరే ఉన్నారు. వాళ్లందరిపై ఈ ఆరోపణలు ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయని ఆలోచించాలి. ఒకరిపై ఆరోపణలు చేసేటప్పుడు ఇంకే ఆలోచించరా?? మా ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు.. నాకు కూతురు ఉంది.. ఆధారాలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసేసి.. లబ్ధి పొందాలనుకుంటే ఈ ప్రభావం రేపటి రోజున చాలామందిపై పడుతుంది” అని కృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు.