Actor Ajay : `డోంట్ టచ్` అంటూ హీరోయిన్ నాపై అరిచేసింది.. నటుడు అజయ్ ఎమోషనల్..!
NQ Staff - June 2, 2023 / 12:21 PM IST

Actor Ajay : తెలుగులో నటుడు అజయ్ కు మంచి గుర్తింపు ఉంది. ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయనకు పేరు వచ్చింది మాత్రం విలన్ పాత్రలతోనే. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన చాలా ఎమోషనల్ కామెంట్లు చేశాడు.
రీసెంట్ గా అజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో మీకు ఇబ్బంది కలిగిన సందర్భం ఏదైనా ఉందా అంటూ అడిగాడు యాంకర్. దానికి ఆయన మాట్లాడుతూ.. శ్రీహరి గారు హీరోగా వచ్చిన ఓ సినిమాలో నేను విలన్ గా నటించాను. నేను సెట్స్ కు వెళ్లిన మొదటి రోజే నాకు రేప్ సీన్ పెట్టారు.
అందులో ఉన్న హీరోయిన్ ను నేను రేప్ చేయాలి. అయితే కెమెరా ఆన్ కాగానే నేను ఆమె దగ్గరకు వెళ్లాను. దాంతో డోంట్ టచ్ అంటూ కేకలు వేసింది. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నన్ను ఏదో నిజంగానే విలన్ గా ఆమె చూసింది ఆ క్షణంలో. చాలా బాధ పడ్డాను. కానీ డైరెక్టర్ ఆమెకు అర్థం అయ్యేలా చెప్పాడు.
నేను ఆమెను ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. కానీ డైరెక్టర్ సీన్ రీ రైట్ చేసి షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత నేను మళ్లీ ఏ సినిమాలో కూడా అలాంటి రేప్ సీన్లు చేయలేదు. ఇంకెప్పుడూ ఇబ్బంది పడలేదు అంటూ చెప్పుకొచ్చాడు అజయ్.