Acharya: ఆచార్య టీజ‌ర్‌కి టైం ఫిక్స్ అయింది.. మెగా ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

Acharya: మెగాస్టార్‌ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ఆచార్య‌. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ముఖ్య పాత్ర పోషించ‌గా, ఆయ‌న స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టించింది. ఈ సినిమాలోని ‘లాహే లాహే’, ‘నీలాంబరి’ సాంగ్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘లాహే లాహే’ పాట అయితే యూట్యూబ్‌లో 60 మిలియన్‌ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది.

acharya time to relase (1)
acharya time to relase (1)

ఆచార్య సినిమాను ఫిబ్రవరి 04, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటించారు. తొలుత దర్శకుడు ఆచార్యను డిసెంబర్‌ 24వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం జనవరి 7వ తేదీకి రిలీజ్‌ చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ రెండు తేదీలకు పెద్దగా గ్యాప్‌ లేకపోవడంతో డిసెంబర్‌ 17న ‘ఆచార్య’ విడుదల చేయాలని కొరటాల నిర్ణయించారట. అయితే ఇదే తేదిన ‘పుష్ప’ ఫస్ట్‌ పార్ట్‌ కూడా రిలీజ్‌ చేస్తామని అప్పట‍్లో మేకర్స్‌ తెలిపారు. కానీ పుష్ప షూటింగ్‌ను ఇంకా పూర్తి చేసుకోలేదు. డిసెంబర్‌ 17 వరకు పుష‍్ప షూటింగ్‌ పూర్తవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. అందుకే చివరిగా ఫిబ్రవరి 04, 2022ను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. తాజాగా సిద్ధ పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్ ని న‌వంబ‌ర్ 28న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలియ‌జేశారు. ఇక ఆ రోజు మెగా ఫ్యాన్స్కి పూన‌కాలే అని అంటున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.