Acharya : చిరంజీవికి భయపడి..

Acharya : మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సర్‘ప్రైజ్’. ఆయన నటిస్తున్న లేటెస్టు మూవీ ‘ఆచార్య’కి సంబంధించి ఈ రోజు (బుధవారం) ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ని ఎల్లుండు అంటే 29వ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఫిల్మ్ యూనిట్ ఇవాళ అఫిషియల్ గా ప్రకటించింది.

Acharya-teaser-will-come-soon
Acharya-teaser-will-come-soon

ధర్మస్థలి ఓపెన్..

‘‘ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని తెరకెక్కించాం. చిరంజీవి గారు మరోసారి ‘ది బెస్ట్’ అనిపించేలా మెగా యాక్షన్ ని కెమెరా ముందు ప్రదర్శిస్తున్న క్రమంలో కరోనా మహమ్మారి రూపంలో ఆటంకాలు వచ్చాయి. దీంతో సుదీర్ఘ కాలం వేచి చూసీ చూసీ ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ ప్రారంభించాం. అసమాన కళాకారులు, అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే సాంకేతిక నిపుణులు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఈ మూవీని మేమెంతగా ఇష్టపడి తీస్తున్నామో, ఎంత కష్టపడుతున్నామో అన్నీ మీరు త్వరలో చూడబోతున్నారు. మరికొద్ది గంటల్లో ఆ అద్భుతం మీ అందర్నీ అలరించనుంది. ఆ అమేజింగ్ చిత్రం పేరే ‘ఆచార్య’. అందులోని ధర్మస్థలి ద్వారాలు జనవరి 29న సాయంత్రం సరిగ్గా నాలుగు గంటల ఐదు నిమిషాలకు తెరుచుకోబోతున్నాయి’’ అంటూ ఓ వీడియోని రిలీజ్ చేశారు.

‘చిరు’ వార్నింగ్: Acharya

‘ఆచార్య’ తాజా సమాచారం కోసం అందరిలాగే చిరంజీవి కూడా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారట. ఆ విషయాన్ని ఆయనే నిన్న ట్విట్టర్ లో తెలిపారు. సినిమా టీజర్ ని న్యూఇయర్ సందర్భంగా గానీ సంక్రాంతిని పురస్కరించుకొని గానీ విడుదల చేస్తారనుకుంటే అలా జరగలేదు. దీంతో మెగాస్టార్ ఆ మూవీ డైరెక్టర్ కొరటాల శివని నిలదీశారు. టీజర్ ని ఇంకెప్పుడు ప్రేక్షకుల ముందుకి తెస్తావ్ అని అడిగారు. దానికి ఆయన ‘అదే పనిలో ఉన్నా..’ అని చెప్పారు. అయినా వదిలిపెట్టని చిరంజీవి ఇప్పటికైనా కరెక్ట్ టైమ్ చెప్పు.. లేదంటే నేనే లీక్ చేస్తానని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆయనకి భయపడి శివ కమిట్ అయిపోయాడు. రేపు (బుధవారం) ఉదయం పది గంటలకి అని నిన్న (మంగళవారం) తేల్చి చెప్పాడు. దానికి తగ్గట్లే ఈ రోజు మార్నింగ్ పది గంటలకు టీజర్ అయితే రిలీజ్ చేయలేదు గానీ ఆ విడుదల సమయాన్ని మాత్రం వెల్లడించారు. దీంతో చిరంజీవి కొరటాలకు థ్యాంక్స్ చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావంటూ అభినందించారు.

 

Advertisement