ACHARYA:ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన మేక‌ర్స్

క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు మ‌ళ్లీ సినిమాల వాయిదాల ప‌ర్వం న‌డుస్తుంది. ఇప్ప‌టికే నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’, విశ్వక్‌సేన్‌ ‘పాగల్’‌ రిలీజ్‌లు వాయిదా వేసుకోగా కొద్ది రోజులుగా ఆచార్య సినిమాను కూడా వాయిదా వేస్తున్న‌ట్టు హోరుగా ప్ర‌చారం న‌డిచింది. మే 13న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నారు దర్శక నిర్మాతలు. దేశంలో రోజుకు 3.50 లక్షలకు పైగా కేసులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ 10 వేల కేసులు వస్తున్నాయి.ఈ క్రమంలో సినిమాను వాయిదా వేయడం మంచిదని నిర్మాతలు భావిస్తున్నారు.

ఏపీ, తెలంగాణలో మరోసారి థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆచార్య సినిమాను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్రాన్ని వేస్తున్నామ‌ని తెలియ‌జేసిన మేక‌ర్స్, ప‌రిస్థితులు అన్ని చ‌క్క‌బ‌డ్డాక కొత్త తేది ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు . ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆచార్య సినిమా ఆగస్ట్ 22న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ రోజు చిరంజీవి పుట్టిన రోజు. అందుకే అదే రోజు విడుదల చేస్తే అభిమానులకు కూడా ట్రీట్ ఇచ్చినట్లు ఉంటుందని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement