Acharya: క‌రోనా వ‌ల‌న మ‌ళ్లీ వాయిదా ప‌డ్డ ఆచార్య‌.. సంక్రాంతి రోజు అభిమానుల‌కి సాడ్ న్యూస్

Acharya: క‌రోనా వ‌ల‌న విడుద‌ల కావ‌లసిన చాలా చిత్రాలు వాయిదా ప‌డ‌గా, ఇప్పుడు ఈ దారిలో ఆచార్య కూడా ప‌య‌నిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

acharya pospone of covid1
acharya pospone of covid1

ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తామని ఇది వ‌ర‌కే నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. అయితే రీసెంట్‌గా ఆచార్య మూవీ రిలీజ్ డేట్‌పై క‌న్‌ఫ్యూజ‌న్ క్రియేట్ అయ్యింది. నెట్టింట ఆచార్య రిలీజ్ డేట్ వాయిదా ప‌డింద‌ని, సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా సంక్రాంతిని పుర‌స్క‌రించుకొని అఫీషియ‌ల్ స్టేటట్‌మెంట్ ఇచ్చారు.

ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల దృష్ట్యా ఆచార్య మూవీని వాయిదా వేస్తున్న‌ట్టు తెలియ‌జేశారు. ప్ర‌తి ఒక్క‌రు ఇంట్లో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, మాస్క్‌లు ధరించాల‌ని తెలియ‌జేస్తూ శుభాకాంక్ష‌లు తెలిపారు. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ్యాట్నీ ఎంట‌ర్టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఆచార్య సినిమాను నిర్మించారు.

దేవాదాయ భూములు అన్యాక్రాంతం అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఇందులో చిరంజీవి, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ న‌క్స‌లైట్స్‌గా క‌నిపిస్తారు. సోనూ సూద్ విల‌న్‌. చిరు జోడిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. చ‌ర‌ణ్ జోడిగా పూజా హెగ్డే న‌టించారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

acharya pospone of covid2
acharya pospone of covid2

కోవిడ్ ప్రభావం లేకుండా ఉండుంటే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు అనుకున్న షెడ్యూల్స్‌లో రిలీజ్ అయ్యుంటే, ‘ఆచార్య’ మూవీ ఫిబ్రవరి 4న వచ్చేసేది. కానీ ఇప్పుడు అన్ని చిత్రాలు వాయిదా పడుతున్నాయి. ఆ కోవలో మెగాస్టార్ ఆచార్య సినిమా వాయిదా పడింది.