Acharya OTT : భారీ రేటుకు క్లోజ్ అయిన ఆచార్య ఓటీటీ డీల్

Acharya OTT : మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అది తండ్రి, కొడుకులు క‌లిసి క‌ట్టుగా వెండితెర‌పై క‌నిపిస్తే ఆ ర‌చ్చేవేరుగా ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టించారు. మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

Acharya OTT businesses record
Acharya OTT businesses record

ఫిబ్రవరి 4న మూవీని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట.ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ రోల్ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఆచార్యలో సిద్ధ పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ టీజర్‌ వచ్చే నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రబృందం కన్ఫర్మ్ చేసింది.

Acharya OTT businesses record
Acharya OTT businesses record

తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం. ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్‌ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ అనే సినిమాను చేస్తున్నారు చిరు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది.