Acharya: ఆచార్య రంగంలోకి దిగాడు.. సంక్రాంతి త‌ర్వాత పాఠాలు నేర్ప‌బోతున్నాడు

Acharya: క‌రోనా ప‌రిస్థితులు కొంత సద్దుమణిగిన నేప‌థ్యంలో చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ ప్ర‌క‌టించేస్తున్నాయి. కాని ఆచార్య మాత్రం ఇన్నాళ్లు అభిమానులని స‌స్పెన్స్‌లో పెట్టేసింది.డిసెంబ‌ర్‌లో పుష్ప వ‌స్తుండ‌డ‌గా, జ‌న‌వ‌రి 7 నుండి వ‌రుస‌గా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆచార్య చిత్రానికి స్పేస్ దొర‌క‌లేదు. ఇన్నాళ్లు ఏ డేట్ అయితే బాగుంటుంద‌ని చూసిన ఆచార్య చిత్రం ఎట్ట‌కేల‌కు క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.

Acharya Movie to release in Sankrati
Acharya Movie to release in Sankrati

మెగాస్టార్‌ చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఆచార్య విడుదల విషయం చర్చనీయాంశంగా మారింది. తొలుత దర్శకుడు ఆచార్యను డిసెంబర్‌ 24వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం జనవరి 7వ తేదీకి రిలీజ్‌ చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు తేదీలకు పెద్దగా గ్యాప్‌ లేకపోవడంతో సందిగ్ధం నెల‌కొంది.

ఎట్ట‌కేల‌కు ఆచార్య చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేయబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. తండ్రి, కొడుకుల ఫొటోని డిఫ‌రెంట్ స్టైల్‌లో క్రియేట్ చేసి చిత్ర పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. ఫిబ్ర‌వ‌రిలో సోలోగా వ‌చ్చిసెన్సేష‌న్ క్రియేట్ చేయాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నారు.