Acharya: టాక్‌కి భిన్నంగా వ‌సూళ్లు రాబ‌ట్టిన ఆచార్య‌..తొలి రోజు ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

NQ Staff - April 30, 2022 / 11:22 AM IST

Acharya: టాక్‌కి భిన్నంగా వ‌సూళ్లు రాబ‌ట్టిన ఆచార్య‌..తొలి రోజు ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

Acharya: బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌రిత్ర‌లు సృష్టించిన చిరంజీవి ఈసారి త‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఆచార్య చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 29న భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సంపాదించుకుంది. అయితే ఇద్ద‌రు మెగా హీరోలు.. అది కూడా చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ప‌వ‌ర్ ఫుల్ రోల్స్‌లో న‌టించ‌టం.. కొరటాల శివ వంటి డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన సినిమా కావ‌డంతో సినిమా థియేట‌ర్స్ భారీగానే క్యూ క‌ట్టారు.

Acharya First Day Box Office Collection

Acharya First Day Box Office Collection


తొలిరోజు వ‌సూళ్లు ఎలా వ‌స్తాయోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. హీరోల‌కున్న ఫ్యాన్ బేస్‌.. క్రేజ్‌, డైరెక్ట‌ర్‌కి ఉన్న ఇమేజ్ అన్ని వెర‌సీ ‘ఆచార్య’ సినిమా తొలి రోజున మంచి క‌లెక్ష‌న్స్‌నే రాబ‌ట్టుకుంది. మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ‘ఆచార్య’ తొలి రోజున రూ.29.50 కోట్లు వ‌సూళ్ల‌ను సాధించింద‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇక క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా, ఓవ‌ర్ సీస్ అంతా క‌లిపి చూస్తే ఆచార్య సినిమాకు రూ.35 కోట్లు పైనే వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి ప్ర‌భావాన్నే చూపించింది.

సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ విడుదలకు నాలుగు రోజుల ముందే మొదలయ్యాయి. సినిమాకు ప్రత్యేకంగా టికెట్స్ హైక్స్ ఫర్మిషన్స్ కూడా లభించడంతో తప్పకుండా మంచి ఓపెనింగ్స్ వస్తాయి అని అందరూ నమ్మకంతో ఉన్నారు. కానీ సినిమా అంచనాలకు తగ్గట్టుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించినంత స్థాయిలో లేవు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో విడుదలైన పెద్ద సినిమాలతో పోలిస్తే ఆచార్య సినిమాకు బుకింగ్స్ అయితే చాలా తక్కువగానే రావడం విశేషం.

కేవలం హైదరాబాద్ లోనే 4.5 కోట్ల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవడం కొంత సంతోషించాల్సిన విషయం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆచార్య’ తొలి రోజు వ‌సూళ్లు.. నైజాం – రూ. 7.90 కోట్లు, సీడెడ్ – 4.60 కోట్లు, ఉత్త‌రాంధ్ర – 3.61 కోట్లు, ఈస్ట్ – 2.53 కోట్లు, వెస్ట్ – 2.90 కోట్లు, గుంటూరు – 3.76 కోట్లు, కృష్ణా – 1.90 కోట్లు, నెల్లూరు – 2.30 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టింది.

ముందుగా ఆచార్య సినిమాకు నాన్ థియేట్రికల్ గా అయితే మంచి లాభాలు వచ్చాయి. చిరంజీవి రామ్ చరణ్ తేజ నటించిన చిత్రం కాబట్టి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా మొత్తంగా 132.50 కోట్ల టార్గెట్ తో మార్కెట్లోకి వచ్చింది . సినిమాకి డివైడ్ టాక్ రావ‌డంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంటుందా అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

Read Today's Latest బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us