Varun Sandesh : హీరో వరుణ్ సందేశ్ కి గాయాలు
NQ Staff - June 21, 2023 / 10:25 PM IST

Varun Sandesh : 2007 సంవత్సరంలో హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరో వరుణ్ సందేశ్. మొదటి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్ కాలం కలిసి రాకపోవడంతో స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. అయినా కూడా ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.
ఈ మధ్య కాలంలో ఇతర హీరోల సినిమాలో వరుణ్ సందేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ది కానిస్టేబుల్ అనే సినిమా లో వరుణ్ సందేశ్ నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ సందర్భంగానే వరుణ్ సందేశ్ కాలుకు బలమైన గాయం అయ్యింది.
కాలుకు అయిన గాయం తీవ్రంగా ఉండటంతో కచ్చితంగా మూడు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలంటూ వైధ్యులు సూచించినట్లుగా తెలుస్తోంది. వరుణ్ సందేశ్ గాయంతో ది కానిస్టేబుల్ సినిమా చిత్రీకరణ ఆగిపోయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ కాలి గాయం మినహా అంతా ఆరోగ్యంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలియజేశారు.