బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు‌.. స‌రికొత్త అధ్యాయం లిఖించిన అభిజీత్

బిగ్ బాస్ సీజ‌న్ 4కు ముగింపు కార్డ్ ప‌డింది. దాదాపు 105 రోజుల పాటు ఉత్కంఠ‌గా సాగిన గేమ్‌లో అభిజిత్ విన్న‌ర్‌గా, అఖిల్ ర‌న్న‌ర్‌గా నిలిచాడు. అంద‌రు ఊహించినట్టే అభిజీత్‌కు టైటిల్ అందించి బిగ్ బాస్ ఎవ‌రి ఆగ్రహానికి గురి కాకుంగా సేవ్ అయి పోయారు. ఎన్నో జాగ్ర‌త్త‌ల మ‌ధ్య‌ నాగార్జున వ్యాఖ్య‌త‌గా ప్రారంభ‌మైన ఈ సీజ‌న్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. క‌రోనా చేయ‌బ‌ట్టి షో ప్రారంభానికి ముందు 14 రోజులు వారంద‌రిని క్వారంటైన్‌లో ఉంచి ఆ త‌ర్వాత డైరెక్ట్‌గా హౌజ్‌లోకి తీసుకొచ్చి బంధించారు. ఒక్కో వారం ఒక్కో కంటెస్టెంట్ బ‌య‌ట‌కు వెళుతూ ఉన్న ఎక్కువ సార్లు నామినేష‌న్ అయిన అభిజీత్ మాత్రం చివరి వ‌ర‌కు ఉండి టైటిల్ ద‌క్కించుకున్నాడు

Abi

ఈ సీజ‌న్‌లో టైటిల్ ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగిన అభిజీత్ టాస్క్‌ల‌లో పెద్ద‌గా ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చ‌లేదు. అత‌ని యాటిట్యూడే ఆయ‌న్ని విజేత‌గా నిలిపింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎప్పుడు చాలా కూల్‌గా ఉండే అభిజీత్ మైండ్ గేమ్ ఎక్కువ‌గా ఆడాడు. హౌజ్‌మేట్స్‌తో ప‌లు విష‌యాల‌లో విభేదించిన అభిజీత్ 11 సార్లు నామినేట్ అయ్యాడు. క‌నీసం ఒక్క‌టంటే ఒక్క సారి కూడా కెప్టెన్ కాలేదు. ఏదో వారంలో ఒక్క‌సారి మాత్ర‌మే కెప్టెన్ బ‌రిలో నిలిచాడు. కాని విజేత కాలేక‌పోయాడు. అయిన‌ప్ప‌టికీ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు.

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ చ‌రిత్ర ప‌రిశీలిస్తే తొలిసారి టైటిల్ అందుకున్న శివ బాలాజీ, రెండో సారి విన్న‌ర్ అయిన కౌశ‌ల్, మూడోసారి విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ఏదో ఒక వారంలో అయితే కెప్టెన్ అయ్యారు. కాని అభిజీత్ మాత్రం ఒక్క సారి కూడా కెప్టెన్ కాకుండా విన్నింగ్ ట్రోఫీ అందుకున్నాడు. ఇది బిగ్ బాస్ చరిత్ర‌లో సువ‌ర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంద‌ని ఆయ‌న అభిమానులు చెప్పుకుంటున్నారు. ర‌న్న‌ర్‌గా నిలిచిన అఖిల్‌తో పాటు మూడో స్థానంలో ఉన్న సోహైల్ కూడా ఇంటి కెప్టెన్ అయ్యారు.