Abijeet : వీకెండ్ రాత్రి మూడు గంటలు ఏకధాటిగా… అభిజిత్ మామూలోడు కాదు!!
NQ Staff - January 24, 2021 / 06:37 PM IST

Abijeet : బిగ్ బాస్ నాల్గో సీజన్ విజేత అభిజిత్ ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. మిగతా కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తున్నా కూడా అభిజిత్ మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాడు. ఒక్కొ కంటెస్టెంట్ సోషల్ మీడియాలో తామే తోపులమన్నట్టుగా రచ్చ చేస్తున్నారు. వారి వారి గ్యాంగులతో కలిసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. కానీ అభిజిత్ మాత్రం సీరియస్‌గా ఓ విషయం మీద కసరత్తులు చేస్తున్నాడు. తన పని ఏదో తాను చూసుకుంటున్నాడు. ఎవ్వరితోనూ ఇప్పుడు అంతగా కలవడం లేదు.
స్క్రిప్ట్‌లతో అభిజిత్ బిజీగా..
అభిజిత్ ముందుగా తన ఫ్యూచర్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలో దృష్టిపెట్టాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిచాం కదా అని ఆగిపోవడం లేదు. ఇదే ప్రారంభం అన్నట్టుగా ఇక ముందు ఏం చేయాలన్న దానిపై మరింత ఫోకస్ పెట్టాడు. అందుకు మిగతా వారిలా తానేమీ సోషల్ మీడియాలో హడావిడిచేయడం లేదు. అభిజిత్ ఇప్పుడు స్క్రిప్ట్‌లను వినే పనిలోనే ఉన్నాడని అందరికీ తెలిసిందే. రోజూ కొన్ని కథలను వింటూ పూర్తి స్క్రిప్ట్‌లను చదువుతూ బిజీగా ఉంటున్నాడు.

Abijeet Bigg Boss Fame Abhijeet May Announce His New Project
అభిజిత్ ఈ విషయాన్ని ఆ మధ్య లైవ్‌లోకి వచ్చినప్పుడు చెప్పాడు. తాను ఇప్పుడు పూర్తిగా స్క్రిప్ట్‌లు వినడంపైనే దృష్టిపెట్టానని, వస్తే మంచి కథతో మీ ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. తన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయని.. ఏ జానర్‌లో సినిమా చేయాలని, ఏ పాత్రను పోషిస్తే బాగుంటుందని అనుకుంటున్నారో చెప్పమని అభిమానులకు ప్రశ్నలు సంధించాడు. పూర్తిగా రొమాంటిక్ కామెడీ సినిమా చేయాలా? లేదా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేయాలా? లేదా ఏదైనా ప్రయోగాత్మక చిత్రం చేయాలా? అని ఆ మధ్య అడిగాడు.
మూడు గంటల పాటు..Abijeet
మూడు చిత్రాలు చేస్తాను కానీ.. ముందుగా ఏ ప్రాజెక్ట్ చేయాలో చెప్పండంటూ అభిజిత్ తన అభిమానులను కోరాడు. అయితే తాజాగా అభిజిత్ ఓ పోస్ట్ చేశాడు. అందులో ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. శనివారం రాత్రి అయినా కూడా మూడు గంటల పాటు నిర్విరామంగా కథను నెరేట్ చేస్తుంటే వింటున్నాను.. ఆ కథ నిజం అవుతుందని తెలుసు.. ఇంతకంటే సంతృప్తి ఏదైనా ఉంటుందా? అని తెలిపాడు. అయితే అభిజిత్ త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్ వివరాలను చెప్పేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టున్నాడు.