Abhishek Bachchan: న‌న్ను ఏమైన అనండి.. నా కూతురు జోలికి వ‌స్తే అస్స‌లు ఊరుకోను: అభిషేక్ బ‌చ్చ‌న్

Abhishek bachchan:  ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ మ‌రింత పెరిగిపోతుంది. హీరో, హీరోయిన్స్‌నే కాకుండా వాళ్ల ఫ్యామిలీపై కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రీసెంట్‌గా ర‌వి కుటుంబంపై కాకుండా, ఆయ‌న కూతురిపై ట్రోల్ చేయ‌డంతో యాంక‌ర్ ర‌వి ఎంత ఆవేదన చెందారో మ‌నం చూశాం. తాజాగా అభిషేర్ బ‌చ్చ‌న్ కూతురిపై కూడా ట్రోలింగ్ జ‌ర‌గ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
abhishek bachchan fires on netizens2
abhishek bachchan fires on netizens2

ఇటీవలె కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లిన బచ్చన్‌ ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంట పడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్‌ వెళ్లింది. ఐశ్వర్య ఎప్పుడూ కూతురి చేయి పట్టుకొనే నడిపించడం, ఆరాధ్య వంకరగా నడుస్తుందంటూ సోషల్‌ మీడియాలో దారుణంగా ట్రోల్‌ చేశారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న అభిషేక్‌ బచ్చన్‌.. తన కూతురి నడకపై చేస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు.

తన తదుపరి చిత్రం ‘బాబ్‌ బిశ్వాస్‌’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..‘‘ నేను పబ్లిక్‌ ఫిగర్‌ని. నన్ను ఎంతైనా ట్రోల్‌ చేయండి. ఒప్పుకొంటా. కానీ నా కూతురిని అనడానికి మీకు హక్కు లేదు. దమ్ముంటే ఆ మాటలను నా ముందు అనండి. ఎవరైనా ఇలా అంటే సహించేదే లేదు’’ అని హెచ్చరించారు.

అభిషేక్‌ నటించిన ‘బాబ్‌ విశ్వాస్‌’ ఈనెల 3న జీ5 ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దియా అన్నపూర్ణ ఘోష్‌ దర్శకత్వం వహించారు. 2012లో వచ్చిన కహానీలోని ‘బాబ్‌ బిశ్వాస్‌’ పాత్రకు వచ్చిన ఫేమ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తీశారు.

abhishek bachchan fires on netizens
abhishek bachchan fires on netizens

అందులో బయటకు బీమా ఏజెంటుగా కనిపించే కరడుగట్టిన కిరాయి హంతకుడి ‘బాబ్‌ బిశ్వాస్‌’ పాత్రను శాశ్వతా ఛటర్జీ అనే నటుడు పోషించగా ఆ పాత్రలో ఇప్పుడు అభిషేక్‌ నటించారు. చిత్రాంగదా సింగ్‌, పరాన్‌, టీనా దేశాయ్‌ కీలక పాత్రలు పోషించారు రెడ్‌ చిల్లీస్‌ సంస్థ నిర్మించింది.