Adipurush Tickets : ‘ఆదిపురుష్’ 10,000+ టిక్కెట్లు ఉచితం
NQ Staff - June 7, 2023 / 09:18 PM IST

Adipurush Tickets : ప్రభాస్, కృతి సనన్ జంటగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు హోల్ సేల్ గా రిలీజ్ చేసేందుకు రూ. 185 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది.
ఆదిపురుష్ సినిమాను నైజాం ఏరియాలో అభిషేక్ అగర్వాల్ పంపిణీ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్న ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలు మరియు అనాథ శరణాలయాలు ఇంకా వృద్ధాశ్రమాలకు ఉచితంగా టికెట్లను ఇవ్వబోతున్నారు.
పది వేల టికెట్లకు పైగా ఇస్తామంటూ స్వయంగా అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. అనాథ ఆశ్రమాలు మరియు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన వారు ఆన్ లైన్ ద్వారా ఈ ఫామ్ లో వివరాలు ఇస్తే వారి కోసం ప్రత్యేక షో లను ఏర్పాటు చేస్తామంటూ ఆయన పేర్కొన్నారు.
దైవ భక్తుడు అయిన ఆయన రామయణ ఇతివృత్తంతో రూపొందిన ఈ సినిమాను ఎక్కవ జనాల ముందుకు తీసుకు వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ADIPURUSH Ticket Distribution Campaign by Abhishek Agarwal Arts (google.com)