Geethika: తన కెరీర్ పై క్లారిటీ ఇచ్చిన ఆట గీతిక
Samsthi 2210 - June 9, 2021 / 02:58 PM IST

Geethika: ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలో ఎవరు ఎలా క్రేజ్ సంపాదించుకుంటారో చెప్పలేం. అలా ఎంతో మంది తమ కెరీర్ ను అద్భుతంగా రాణించారు. అలా బుల్లితెరపై సూపర్ స్టార్స్ గా ఎదిగారు. అందులో ప్రముఖ ఛానల్ లో ఆట డాన్స్ షోలో ఎంతో మంది క్రేజ్ సంపాదించుకున్నారు. అందులో ఆట గీతిక కూడా ఎంతో హైప్ సాధించారు. తన అందమైన అల్లరితో, మాటలతో చిన్న వయసులో తన డాన్స్ తో అలరించింది. డాన్స్ షోలో గెలిచి పాపులర్ అయ్యింది.

Aata Geethika Latest Interview Update
సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత మళ్ళీ అటు సిల్వర్ స్క్రీన్ పై, ఇటు బుల్లితెర పై కనిపించలేదు. దీంతో గీతిక జీవితం చాలా దారుణంగా మారింది. ఆమె జీవితం చాలా దయనీయ స్థితిలో ఉందో చూడాలంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో గీతిక క్లారిటీ ఇచ్చింది. 2012 లో జరిగిన ప్రమాదంలో తనకు కాలు, చేతికి గాయలవడం బాధాకరం. తనతో పాటు తన తండ్రి కూడా ప్రమాదం భారిన పడ్డారని చెప్పింది. ఇంకా పలు కారణాలతో షూటింగ్స్ కు రావడం బ్రేక్ అయ్యిందని తెలిపింది.
సరిగ్గా అలాంటి టైమ్ లోనే గీతక పై వీడియోలు సృష్టించారు. వీటికి గీతిక అవకాశాలు పోయాయి. గీతిక గురించి ఎన్నో నిజాలు అంటూ రకరకాల రూమర్స్ వచ్చాయి. అవన్నీ అసత్య ప్రచారాలు వ్యాప్తి చెందాయి. ప్రస్తుతం తాను ఇంటర్మీడియట్ చదుతున్నానని ఇంటర్వ్యు లో తెలిపారు. ఇప్పటికీ తను డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని.. నెక్స్ట్ ఇయర్ నుండి కెరీర్ పై ఫోకస్ పెడతానని అన్నారు.
భవిష్యత్ లో అవకాశాలు వస్తే, తప్పకుండా చేస్తానని అన్నారు. అలాగే తనకు చిన్నతనం నుండి డాన్స్ అంటే ప్రాణం అని.. తన ఇష్టంను గుర్తించి తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారని, వాళ్ళకి ఎంతో ఋణపడి ఉంటానని అన్నారు. ప్రస్తుతం తాను చదువుపై దృష్టి పెడుతున్నాను అని తెలిపారు.