AISHWARYA RAI : బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1994లో ప్రపంచ సుందరిగా ఎంపికైన ఆమె ఎందరో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సినిమాలు, యాడ్స్‌లో నటించింది. ఐష్ ప్రతిభకు ఫిలింఫేర్ పురస్కారాలతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2009లోభారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రపంచంలోని అత్యంత అందమైనవారిలో ఒకరిగా ఐశ్వర్యను పేర్కొంటుంటారు. 2007లో ఐశ్వర్య రాయ్.. ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు. 2010 వరకు సినిమాలు చేసిన ఐష్ కొద్ది గ్యాప్ తీసుకుంది. 2011 నవంబర్ 16న ఐష్, అభిషేక్ దంపతులుకు ఆరాధ్య అనే కూతురు జన్మించింది.
2015లో జజ్బా సినిమాతో తిరిగి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు ఐశ్వర్యరాయ్. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ, గతంలో చేసినన్ని సినిమాలకు కమిట్ కావడం లేదు. కూతురి ఆలనపాలనా కుటుంబ బాగోగులు చూసుకుంటూ కాలం గడుపుతుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఐశ్వర్యరాయ్ అప్పుడప్పుడు తన కూతురితో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అవే కాక ఆరాధ్య పర్ఫార్మెన్స్ వీడియోలు కూడా అప్ లోడ్ చేస్తుంటుంది. వీటిని చూసిన బచ్చన్ అభిమానులు మురిసిపోతుంటారు. ఆరాధ్యని సినిమాలలోకి ఎప్పుడు తీసుకొస్తుంటారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు.
ఒకే ఫ్రేంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలని చూడడం అభిమానులకు చూడ ముచ్చటగా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని సందర్భాలలో జరుగుతుంటుంది. తాజాగా ఓ వేడుకకు వీరు ముగ్గురు హాజరు కాగా, ఈ బాలీవుడ్ జోడీ ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్ తమ ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి డ్యాన్స్ చేసి అలరించారు. ఐశ్వర్య, అభిషేక్‌తో కలిసి ఆరాధ్య చిందేస్తుంటే స్టేజ్ కింద ఉన్న వారు కేకలతో వారిలో జోష్ నింపారు. ప్రస్తుత వీరి డ్యాన్స్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంకా చోప్రా నటించిన దేశీ గర్ల్ పాటకు అభిషేక్ ఫ్యామిలీ చిందులేయగా, డ్యాన్స్ ఫ్లోర్‌పై కేక పుట్టించిన ఆరాధ్య వీడియోను మీరు చూడండి.
View this post on Instagram