Aamir Khan: విడాకుల త‌ర్వాత హ్యాపీగా.. తొలిసారి క‌లిసి వీడియో చేసిన అమీర్, కిర‌ణ్‌

Aamir Khan: మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ఊహించ‌ని షాక్ ఇచ్చాడు. 15ఏళ్ల కాపురం అనంతరం తన రెండో భార్య.. కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమీర్ – కిరణ్ రావు జంట సంయుక్త ప్రకటన వెలువరించింది. మేము మా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. ఇకపై భార్యాభర్తలుగా కాకుండా తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్ కి సహ-తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకుంటామని.. అలాగే పానీ ఫౌండేషన్ లో వృత్తిపరమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని ఈ జంట ప్రకటించారు.

Aamir Khan

అమీర్ ఖాన్‌కి గ‌తంలో రీనా ద‌త్తాను వివాహం చేసుకోగా, ఈ జంట‌కు జునైద్ ఖాన్ – ఇరా ఖాన్ అనే పిల్ల‌లు ఉన్నారు. జునైద్ ఇప్పటికే బాలీవుడ్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇరా ఖాన్ ప్రస్తుతం తన జిమ్ కోచ్ శిఖారే తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ల‌గాన్ చిత్రీక‌ర‌ణ స‌మయంలో కిర‌ణ్‌ని క‌లుసుకున్న అమీర్ ఆమెతో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నారు.

15 ఏళ్లుగా ఎంతో ఆప్యాయంగా ఉంటూ వ‌స్తున్న అమీర్ ఖాన్- కిర‌ణ్ రావు ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకుంటున్నాం అని చెప్పే స‌రికి అంద‌రు షాక్ అయ్యారు. వీరిద్ద‌రు విడిపోవ‌డానికి కార‌ణం దంగ‌ల్ ఫేమ్ ఫాతిమా స‌నా షేక్ అని చెబుతున్నారు. కొన్నాళ్లుగా ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ షిప్ ఉంద‌ని , ఆ కార‌ణంగానే అమీర్ త‌న భార్య‌కు విడాకులు ఇచ్చార‌ని సోష‌ల్ మీడియాలో త‌గె ప్ర‌చారం చేశారు. అయితే అమీర్, ఆమె భార్య‌పై కూడా ట్రోలింగ్ న‌డుస్తున్న నేప‌థ్యంలో వీరిద్ద‌రు జంట‌గా వీడియోతో అభిమానుల ముందుకు వ‌చ్చారు.

మేము చెప్పిన విష‌యం విని మీరు భాద‌ప‌డి ఉండొచ్చు, మీకు బాగా అనిపించ‌క‌పోయి ఉండ‌వ‌చ్చు. షాక్ కూడా క‌లిగించి ఉండొచ్చు. మేము ఇద్ద‌రం సంతోషంగా ఉన్నాం. ఈ విష‌యాన్ని మీకు చెప్పాల‌ని ఇలా మీడియా ముందుకు వ‌చ్చాం. మా మ‌ధ్య ఉన్న రిలేష‌న్ షిప్‌లో మార్పు వ‌చ్చిందే కాని మేమిద్ద‌రం ఒక కుటుంబం. మేము ఒక‌రి కోసం ఒక‌రం ఉంటాం అని అమీర్ స్ప‌ష్టం చేశాడు.