Aaliyah Kasyap : నెటిజ‌న్స్ ఆగ్ర‌హానికి గురైన డైరెక్ట‌ర్ కూతురు.. బాధ‌ను చెప్పుకొని బాధ‌ప‌డ్డ ఆలియా

Aaliyah Kasyap : సోషల్ మీడియా.. ఒక కామన్ మెన్ సెలెబ్రిటీ అవ్వాలన్నా.. పాపులారీటి తెచ్చుకున్నవాళ్ళు సాధారణ స్థాయికి పడిపోవాలన్నా.. సింగిల్ డేలో.. సింగిల్ ప్లాట్ ఫామ్ తో అయిపోతుంటుంది. అలా అని సోషల్ మీడియాకి దూరంగా ఉండలేరు. పెట్టిన పోస్టులకి కామెంట్ చేస్తే అస్సలు భరించలేరు. ప్రస్తుతం సోషల్ మీడియా పరిస్థితి ఇది. నెటిజన్లు తమకు నచ్చిన కామెంట్లు చేస్తుంటారు. అలాంటి ఓ ఇన్సిడెంట్ ని రీసెంట్ గా ఎదుర్కుంది ఓ బ్యూటీ. తానెవరో కాదు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్. ఈమె ఇప్పుడు నెటిజన్లకు.. సైలెంట్ గా తాను పెట్టిన పోస్టులకు సమాధానం చెప్పుకుంటుంది. ఈ మధ్యకాలంలో ఆలియా ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసిన నెటిజన్ల కోపం నషాళానికి అంటింది. దాంతో ఆలియాని విపరీతంగా ట్రోల్ చేశారు. ఆలియా హిందూగా ఉండేందుకు అర్హత లేదంటూ.. దీనికి ఆమె సిగ్గుపడాలంటూ కామెంట్స్ చేశారు. దీనికి భయపడిన ఆమె సోషల్ మీడియాలో ఆమె బాధ చెప్పుకుంది.

తాను పోస్ట్ చేసిన వీడియో సెక్సువల్ గా రెచ్చగొట్టేలా ఉందని.. ఆలియా అంత నీచమైన వీడియో పోస్ట్ చేయడం అవసరమా అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఏదో క్రేజ్ కోసం ఇలాంటి వేషాలు వేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. దీంతోపాటు ఇల్లీగల్ రిలేషన్స్ వారే క్రియేట్ చేసుకుని.. హైప్ పెంచుకుంటారంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో అత్యధికంగా పాపులారిటీ ఉన్న ఆలియా కూడా ఇలాంటి పరిస్థితులకు సంబంధం లేకుండా పోస్టులు చేస్తే ఇలాగే బాధపడాల్సి వస్తుందని అంటున్నారు ఆమె అభిమానులు.

ఈ కామెంట్స్ కి, పోస్టులకు రెస్పాండ్ అయిన ఆలియా తాను వ్యభిచారి అని అన్నారని, తనపై అత్యాచారం చేస్తామని చేసిన పోస్టులు తనను ఎంతగానో బాధించాయని ఆలియా బాధ పడింది. తాను పెట్టిన పోస్టులు ఎవర్ని ఇబ్బందిపెట్టేలా తాను పోస్ట్ చేయలేదని అన్నారు. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉన్న వ్యక్తుల్లో ఆలియా ఒకరు.

Advertisement