Aadi Reddy : బిగ్ బాస్ తెలుగు: పబ్లిసిటీ కోసం ఆది రెడ్డి ఎన్ని లక్షలు ఖర్చు చేస్తున్నాడో.!

NQ Staff - September 23, 2022 / 08:27 AM IST

160220Aadi Reddy : బిగ్ బాస్ తెలుగు: పబ్లిసిటీ కోసం ఆది రెడ్డి ఎన్ని లక్షలు ఖర్చు చేస్తున్నాడో.!

Aadi Reddy : బిగ్ బాస్ రియాల్టీ షో వల్ల వచ్చే పేమెంట్ ఎంత.? అన్న సంగతి పక్కన పెడితే, ఈ రియాల్టీ షో ద్వారా వచ్చే పాపులారిటీ తక్కువేమీ కాదు. ‘అబ్బే, ఆ షో వల్ల మాకు ఒరిగిందేమీ లేదు..’ అని కొందరు చెప్పొచ్చుగాక.! కానీ, బిగ్ బాస్ రియాల్టీ షో వల్ల లాభమే తప్ప, ఏ కంటెస్టెంటుకీ నష్టం వుండదన్నది సహజంగానే వినిపించేమాట. అందుకే, ఈ షో కోసం వెళ్ళేవారెవరైనా ముందుగా సోషల్ మీడియా టీమ్స్ పెట్టుకుంటుంటారు.

Aadi Reddy BiggBoss Publicity News

Aadi Reddy BiggBoss Publicity News

ఇందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వుంటుంది. మొత్తంగా సుమారు రెండున్నర నుంచి మూడు నెలల కాలం అనుకుంటే.. దానికోసం తగినంత ఖర్చు చేయక తప్పదు కదా.! వేలల్లో కాదు, లక్షల్లోనే.! వేలల్లో చెల్లింపులు చేస్తే సరిపోదు, లక్షల్లో వెచ్చిస్తేనేగానీ, తమ పాపులారిటీని పెంచేలా సోషల్ మీడియాలో బృందాలు పని చేయవు. ఎలిమినేషన్ కోసం నామినేషన్‌లో వున్న సందర్భాల్లో ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి.? మిగతా సమయాల్లో ఏం చేయాలి.? ఇలా రకరకాల వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి.

బిగ్ బాస్ విషయంలో ‘రివ్యూయర్’గా ఆరితేరిపోయిన ఆదిరెడ్డి ఈసారి కంటెస్టెంట్ అయ్యాడు. కామనర్ కేటగిరీలో వెళ్ళాడు. కానీ, ఈయనా లక్షల్లోనే వెచ్చించాడన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ టాక్. సెలబ్రిటీల కంటే ఎక్కువగా ఖర్చు చేయబట్టే, ప్రతి వారం, ప్రతిరోజూ ఆది రెడ్డి పేరు సోషల్ మీడియాలో మార్మగిపోతోందని అనుకోవచ్చు. ఆ మొత్తం సుమారుగా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు వుండొచ్చన్నది ఓ అంచనా.